ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ వాడుతున్నారా..

MIcrosoft Says That Users Must Update Thier Internet Explorer

03:53 PM ON 12th December, 2015 By Mirchi Vilas

MIcrosoft Says That Users Must Update Thier Internet Explorer

ప్రస్తుతం అనేక రకాల వెబ్ సెర్చ్ ఇంజన్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఫైర్ ఫాక్స్.. గూగుల్ క్రోమ్ మొదలైనవి దూసుకుపోతున్నాయి. అయినా ఇప్పటికీ చాలామంది మైక్రోసాఫ్ట్ కు చెందిన ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ బ్రౌజర్ ని వాడుతున్నారు. అయితే ఐఈ బ్రౌజర్ ను వాడే వారు జాగ్రత్తగా ఉండాలని, తమ సమాచారం సురక్షితంగా ఉండాలంటే తమ బ్రౌజర్ ను అప్ డేట్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ హెచ్చరిస్తోంది. ఇందు కోసం కేవలం ఐదు వారాల గడువు మాత్రమే ఉందని చెపుతోంది. ఒకవేళ అప్ గ్రేడ్ చేసుకోనట్లయితే సెక్యూరిటీ అటాక్స్ ను ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఐఈ11 అందుబాటులో ఉంది. దీనిని అప్ గ్రేడ్ చేసుకునేందుకు జనవరి 12 చివరి తేదీ అని చెపుతోంది. అప్పటికి అప్ గ్రేడ్ చేసుకోనట్లయితే ఆ తర్వాత తాము పాత వెర్షన్లకు సెక్యూరిటీ అప్ డేట్లు, టెక్నికల్ సపోర్ట్ అందిచబోమని ప్రకటించింది. ప్రస్తుతం ఇంటర్నెట్ ను వినియోగించుకునే వారిలో సుమారు 21.42 శాతం మంది ఇప్పటికీ పాత మైక్రోసాఫ్ట్ వెబ్ బ్రౌజర్లనే వినియోగిస్తున్నారట. ఈ సంఖ్య సుమారు 124 మిలియన్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

English summary

Microsoft updates its internet explorer browser recently. Microsoft company has warned that there will be some problems by using internet explorer without update of the browser