సెల్ఫీ లవర్స్ కోసం మైక్రోసాఫ్ట్ సెల్ఫీ..!

Microsoft Selfie App for iOS

12:31 PM ON 1st January, 2016 By Mirchi Vilas

Microsoft Selfie App  for  iOS

ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ఐఓఎస్ వినియోగదారుల కోసం 'మైక్రోసాఫ్ట్ సెల్ఫీ' పేరిట సరికొత్త సెల్ఫీ యాప్‌ను రిలీజ్ చేసింది. సెల్ఫీ లవర్స్ కోసమే ప్రత్యేకంగా దీన్ని రూపొందించినట్టు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. ఐఫోన్‌ వాడే యూజర్లు ఇప్పుడు మరింత నాణ్యంగా సెల్ఫీలను తీసుకునేందుకు ఈ యాప్ తో వీలవుతుంది. ఫ్రేమ్‌లోకి వచ్చే వ్యక్తులను గుర్తించి అందుకు అనుగుణంగా ఈ యాప్ ఫొటోలను కాప్చర్ చేస్తుంది. ఈ యాప్ ద్వారా సెల్ఫీలే కాకుండా బ్యాక్ కెమెరా ఫొటోలు కూడా తీసుకోవచ్చు. యూజర్లు తీసిన ఫొటోల కలర్ బ్యాలెన్స్‌ను ఈ యాప్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. స్కిన్ టోన్, లైటింగ్ వంటి అంశాలను ఇంప్రూవ్ చేసుకునేందుకు, ఫొటోలను ఆకర్షణీయంగా కనిపించేలా మార్చేందుకు నాయిస్ రిడక్షన్, కలర్ థీమ్ వంటి 13 రకాల ఫొటో ఫిల్టర్‌లను ఇందులో అందిస్తున్నారు. ఈ యాప్ ద్వారా తీసుకున్న ఫొటోలను ఎడిట్ చేసుకుని వాటిని ఇన్‌స్టాగ్రాం, గూగుల్ ఫొటోస్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో ఇతరులకు షేర్ చేసుకోవచ్చు. ఐఓఎస్ 8.0 ఆపైన వెర్షన్ కలిగిన యూజర్లు దీన్ని యాపిల్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

English summary

Microsoft Selfie App for iOS