జనవరిలో భారత్‌లోకి మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ ప్రో4

Microsoft Surface Pro 4 to be launch, January in India

07:26 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Microsoft Surface Pro 4 to be launch, January in India

సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ ప్రో4 ట్యాబ్లెట్‌ జనవరి మొదటి వారంలో భారత మార్కెట్లో కాలుపెట్టనుంది. జనవరి 7న దిల్లీలో జరిగే కార్యక్రమంలో ఇది భారత్‌లో విడుదల కానున్నట్టు సమాచారం. అయితే ఈ తేదీని సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జనవరిలో సర్ఫేస్ ప్రో4ను ఇక్కడ విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

సర్ఫేస్ ప్రో4 ట్యాబ్లెట్ ఫీచర్ల విషయానికి వస్తే 12.3 అంగుళాల తాకే తెర, 2736×1824 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 4 ప్రొటక్షన్‌, ఇంటెల్‌ కోర్‌ ఎం3 ప్రాసెసర్‌, ఇంటెల్‌ హెచ్‌డీ గ్రాఫిక్స్‌ కార్డ్‌ ఉంది. మన రిక్వైర్ మెంట్లకు తగినట్టుగా ప్రాసెసర్, గ్రాఫిక్ కార్డులను ఎంచుకునే సదుపాయంకుంది. 8 మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా ఉన్నాయి. 4 జీబీ నుంచి 16 జీబీ ర్యామ్‌తో.. అలాగే 128 జీబీ నుంచి 1టీబీ వరకు అంతర్గత మెమొరీతో లభ్యమవుతోంది. ఇందులో నాలుగు యూఎస్బీ పోర్ట్ లు, ఒక ఎతర్నెట్ పోర్టు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

English summary

Microsoft launching its Surface Pro 4 January in india. This is not announced officially but plannig to launch in one of the event will conduct on january 7th 2016.