ఎక్స్‌ప్లోరర్‌ 8, 9, 10 వెర్షన్లకు గుడ్ బై

Microsoft to Stop Internet Explorer 8, 9, 10

06:29 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Microsoft to Stop Internet Explorer 8, 9, 10

మీరు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోర్లర్ పాత వెర్షన్లు వాడుతున్నారా.. అయితే వెంటనే దానిని అప్ గ్రేడ్ చేసుకోండి లేదా వేరే బ్రౌజర్ కు మారిపోండి లేకుంటే.. మీకు ఇంటర్నెట్ ను వినియోగించే అవకాశం దక్కకపోవచ్చు. ఎందుకంటే.. ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ 8, 9, 10 వెర్షన్లకు ఇకపై సపోర్టు ఇవ్వకూడదని ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ నిర్ణయించింది. ఈ నెల 12 నుంచి ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌కు మైక్రోసాఫ్ట్‌ సపోర్ట్ ను నిలిపేయనుంది. ఇటీవల మైక్రోసాఫ్ట్‌ కంపెనీ కొత్తగా మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ పేరుతో బ్రౌజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నడుస్తుంది. ఎక్స్‌ప్లోరర్‌ స్థానాన్ని భర్తీ చేయడానికే మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్‌ను రూపొందించింది. అయితే విండోస్‌ 10 సహాయంతో నడిచే ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ 11 ఇక మీదట కూడా కొనసాగనుంది. విండోస్‌ 7 కంప్యూటర్లు, విండోస్‌ సర్వర్‌ 2008ఆర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లను వాడే వినియోగదారులు వాటిని అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్‌ కోరింది. అలాగే ఐఈ 8, 9, 10 బ్రౌజర్లను ఐఈ 11తో అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్‌ సూచించింది.

English summary

Microsoft company to stop its internet explores browser versions 8,9,10