ఈ గాలి విమానం గురించి తెలిస్తే షాకౌతారు!

Mig 31 aeroplane

11:05 AM ON 14th October, 2016 By Mirchi Vilas

Mig 31 aeroplane

విమానమేంటి దాన్ని మడిచేయడమేంటి అనుకుంటున్నారా? అవును మిగతా విమానాలకన్నా ఇది భిన్నం. అందుకే ఈ విమానాన్ని చక్కగా మడిచేయచ్చు. చుట్టేసి ట్రక్కులో ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు! అవసరమైనప్పుడు ఇందులో పూర్తిగా గాలి నింపితే చాలు.. శత్రువులపై దాడి చేసేయచ్చు. ఇంతకీ ఈ విమానాన్ని ఎయిర్ బెలూన్స్ తయారుచేసే రూస్బెల్ అనే కంపెనీ తయారుచేసింది. వీటితో పాటు గాలితో నింపే ట్యాంకులు, యుద్ధ విమానాలు, రాకెట్ లాంచర్లను రష్యా రక్షణ శాఖ కోసం ఈ సంస్థ తయారుచేస్తోంది. ఇది నిజమైన యుద్ధ విమానమా లేక గాలితో నింపిన విమానమా? అని శత్రువుల్లో సందేహాన్ని రేకెత్తించి.. వారు దాడిచేసే లోపే ప్రతిదాడి చేయడమే వీటి తయారీ వెనకున్న అసలైన వ్యూహం!!

1/3 Pages

యుద్ధంలో విజయం సాధించేందుకు రకరకాల యుక్తులు ప్రదర్శించాలని, అందులో ఈ విమానం కూడా ఒకటని రష్యా అధికారులు తెలిపారు. ఇదేదో ఎయిర్ బెలూన్ లా ఉందే. అయినా దీనిని నేలమీద ఇలా పరిచారేంటి? దీనికి మరోవైపు గాలి కొడుతున్నారేంటి ఇలా అనుకోవచ్చు కానీ ఇది సాధ్యం. ఇక ఇలా గాలి కొడుతుంటే విమానమైపోతోదేంటి? ఇప్పటివరకూ నేలపైన పరిచింది దీనినేనా? ఇందులో ఏమైనా మాయ ఉందా? అని ఆశ్చర్యపోవద్దు.

English summary

Mig 31 aeroplane