కోకకోలా నుంచి మిల్క్ ప్రొడక్ట్స్

Milk Products From Coco Cola

10:46 AM ON 27th January, 2016 By Mirchi Vilas

Milk Products From Coco Cola

ప్రముఖ శీతల పానీయాల సంస్థ కోకకోలా... భారత్‌లో పాల పానీయాల రంగంలోకి ప్రవేశించింది. వయో బ్రాండ్‌పై రెండు రకాల పాల పానీయాలను ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా విక్రయించనుంది. ప్రస్తుతం రిలయన్స్‌ రిటైల్‌తో ఒప్పందం చేసుకుని, మంగళవారం నుంచి ఆ సంస్థ నిర్వహిస్తున్న 500 విక్రయశాలల్లో ప్రయోగాత్మక విక్రయాలు చేపడతామని కోకకోలా భారత్‌, నైరుతీ ఆసియా విభాగాధిపతి వెంకటేశ్‌ కిని వెల్లడించారు. ష్రైబర్‌ డైనమిక్స్‌ డెయిరీస్‌తో ఒప్పందం చేసుకుని, కేసర్‌ ట్రీట్‌, ఆల్మండ్‌ డిలైట్‌ పేరిట 2 రకాల రుచులతో పానీయాలు తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. 200 మిల్లీలీటర్ల ఈ పానీయాల ధర రూ.25గా తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని ఆధునిక విక్రయశాలల్లో ఫిబ్రవరి 3 నుంచి అమ్మకాలు చేపడతామని, అనంతరం తమ సంప్రదాయ పంపిణీ వ్యవస్థకూ అందిస్తామని వివరించారు.

English summary

World Famous cool drink company Coco Cola company to enter into Milk Products business in India.This was said by India & South West Asia President Venkatesh Kini.