వెయ్యి రూపాయలకే వాడుకున్నారు

Milky beauty Tamanna Appeared In Ads for Only One Thousand

04:46 PM ON 14th March, 2016 By Mirchi Vilas

Milky beauty Tamanna Appeared In Ads for Only One Thousand

టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా. ఈమె రెమ్యూనరేషన్‌ కోటికి పై మాటే. ఈ మిల్కీ తమన్నా సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందో తెలుసా ?ఎంత సంపాదించిందో తెలుసా ? తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. సినిమాల్లో ఎంట్రీ కోసం ట్రై చేస్తున్న తరుణంలో ఆమెకు చాలా తక్కువ సంపాదన వచ్చేదట. ఒక్కోసారి అయితే కేవలం వెయ్యిరూపాలకు కూడా తనని వాడుకున్నారని ఈ మిల్కీ బ్యూటీ చెబుతుంది. ఇంతకి ఆమెను దేనికి వాడుకున్నారనే కదా మీ సందేహం.

వివరాల్లోకి వెళితే తమన్నా హీరోయిన్‌ కాకముందు మోడల్‌గా చాలా యాడ్స్‌ చేసిందట. కెమెరా ముందు కనిపించే అవకాశం వస్తే చాలనుకునేదట ఈ ముద్దు గుమ్మ. అలాంటి తరుణంలో పారితోషికం గురించి కూడా పట్టించుకునేది కాదట. ఆమె వెయ్యి రూపాయలకు, రెండు వేలుకు కూడా యాడ్స్‌ చేసేదట. మరీ అంత తక్కువ డబ్బులకు చేయాల్సిన అవసరం ఏంటి అని అడిగిన వారితో తన ప్యూచర్‌కి తాను పెడుతున్న పెట్టుబడి అనేదట ఈ భామ. ఇలాంటి యాడ్స్‌లో ఎవరైనా తనను చూసి అవకాశమిస్తే చాలు అనుకునేదట. సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తమన్నా ప్రస్తుతం టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరు. తమన్నా ఈ రేంజ్‌ కి రావడానికి ఉపయోగపడిన యాడ్స్‌ షూటింగ్‌ విషయాలను నెమరువేసుకుంది.

English summary

Milky beauty Tamanna Appeared In Ads for Only One Thousand