బీఫ్ ఫెస్టివల్ కి ఎంఐఎం నేత అసదుద్దీన్ కి ఆహ్వానం 

Mim Leader Asaduddin Owaisi Gets Invitation To Beef Festival

11:32 AM ON 23rd November, 2015 By Mirchi Vilas

Mim Leader Asaduddin Owaisi Gets Invitation To Beef Festival

ఆ మధ్య ఆవు మాంసం తిన్నారని దాడులు చేయడం , ఈ ఘటన బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశం కావడం తెల్సిందే , దాంతో దేశంలోని పలు ప్రాంతాల్లో బీఫ్ ఫెస్టివల్ పేరిట ఆవు మాంసం తినడానికి పలు సంస్థలు , వ్యక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో డిసెంబరు 10న బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు ఓయూ విద్యార్థులు తలపెట్టారు. దీనికి రావాలని అందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు. ఇందులో భాగంగా బీఫ్‌ ఫెస్టివల్‌కు రావాలని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీని ఓయూ విద్యార్థులు కోరారు. ఈ మేరకు ఆదివారం అసదుద్దీన్‌ను ఆయన కార్యాలయంలో విద్యార్థులు కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. దీనికి ఆయన సానుకూలంగాస్పందించారని విద్యార్థులు అంటున్నారు. ఆహ్వాన పత్రాన్ని అందజేసిన వారిలో విద్యార్థి సంఘాల నాయకులు ముసావీర్‌, శరత్‌, డేవిడ్‌, స్టాలిన్‌, హబీబ్‌ ఖాద్రీ, హరీష్‌ ఉన్నారు.

English summary

MIM Party Leader Asaduddin Owaisi gets invitation to Beef Festival. This Beef Festival is to be held By Osmania University Students. Students Invited Various Leaders and They Invited Asaduddin Owaisi to attend this Beef Festival Make it Grand Success.Asaduddin Owaisi also responds Positively ann likely to attend that Beef Festival