యాపిల్ కంపెనీకు దిమ్మ తిరిగే షాక్!

Mind block shock to Apple company

11:46 AM ON 31st August, 2016 By Mirchi Vilas

Mind block shock to Apple company

టెక్ దిగ్గజానికి భారీ షాక్ తగిలింది. యూరోపియన్ యూనియన్ చరిత్రలోనే భారీ పన్ను ఎగవేత ఇష్యూలో యాపిల్ బుక్ అయ్యింది. గుట్టుగా చేసుకున్న ఒప్పందం కారణంగా ఎగ్గొట్టిన పన్నును చెల్లించాలంటూ యూరోపియన్ యూనియన్ యాంటీట్రస్ట్ రెగ్యులేటరీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గుట్టు రట్టు అయ్యింది. యూరోప్ లో వ్యాపారాన్ని నిర్వహించిన యాపిల్, ఐర్లాండ్ లో అతి తక్కువ పన్ను చెల్లించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రెగ్యులేటరీ భారీ జరిమానా విధించటం వాణిజ్య వర్గాల్లో హాట్ న్యూస్ అయింది. అయితే ఈ ఫైన్ ఏకంగా రూ.97వేల కోట్లు అవ్వడంతో అంతా అవాక్కవుతున్నారు.

ఎందుకంటే ఒక సంస్థకు రెగ్యులేటరీ ఏకంగా రూ.97వేల కోట్ల జరిమానాను విధించటం యూరోపియన్ యూనియన్ చరిత్రలో ఇదే తొలిసారిగా అభివర్ణిస్తున్నారు. స్వీట్ హార్ట్ గా పిలుస్తున్న ఈ డీల్ వివరాల్లోకి వెళితే.. టెక్ దిగ్గజం యాపిల్.. ఐరీష్ ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లుగా ఆరోపిస్తున్నారు. ఈ డీల్ తో యూరోప్ లో మొత్తంగా పన్ను ఎగ్గొట్టారన్నది అధికారుల ఆరోపణ. అమెరికాకు చెందిన అనేక మల్టీనేషనల్ కంపెనీల్ని ఆకర్షించిన ఐరీష్ ప్రభుత్వం.. అతి తక్కువ పన్నుఆశ చూపించి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా చెబుతున్నారు. 1980 నుంచి ఐర్లాండ్ లో యాపిల్ కంపెనీ 5వేల మంది ఉద్యోగులున్న ఒక యూనిట్ ను తెరిచారు.

అక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో అమ్మకాలు నిర్వహించారు. గతంలో ఇదే రీతిలో అమెరికాకు చెందిన పలు కంపెనీలపై రెగ్యులేటరీ జరిమానా కొరడాను ఝుళిపించటాన్ని గుర్తు చేస్తున్నారు. ఒక శాతం పన్ను చెల్లించాల్సిన చోట కేవలం 0.005 శాతం మాత్రమే పన్ను చెల్లించేలా చేసుకున్న ఒప్పందం యాపిల్ కొంప ముంచిందన్న మాట వినిపిస్తోంది. అందుకే అసలు ఈ గొడవంతా మొదలైందని అంటున్నారు. అయితే, యూరోపియన్ యూనియన్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ తాజాగా ఇచ్చిన ఆదేశాల్ని ఐరీష్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటూ యాపిల్ కు బాసటగా నిలుస్తోంది.

ఇది కూడా చదవండి: బాలుడిని రేప్ చేసిన మహిళ.. అది వీడియో తీసి.. ఆపై..

ఇది కూడా చదవండి: శ్రీకృష్ణుడు విగ్రహం ఖరీదు తెలిస్తే గుండె జారిపోద్ది(వీడియో)

ఇది కూడా చదవండి: ఔటర్ దగ్గర ఘోర ప్రమాదం - 8 మంది యువకుల దుర్మరణం

English summary

Mind block shock to Apple company. Apple ordered by EU to repay 97 thousand crores in Irish Tax-Breaks.