అదరగొడుతున్న ట్రంప్ కారు... అందులో ఫీచర్స్ తెలిస్తే మతిపోతుంది!

Mind blowing features in Donald Trump car

11:58 AM ON 1st December, 2016 By Mirchi Vilas

Mind blowing features in Donald Trump car

ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి త్వరలోనే అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించబోతున్న డొనాల్డ్ ట్రంప్ అన్నింటిలోనూ స్పెషలే. అసలు అమెరికా ప్రెసిడెంట్ అంటేనే ప్రపంచంలోని ఏ దేశ అధ్యక్షుడికీ లేని సెక్యూరిటీ, అంతే స్థాయిలో రాజభోగాలు కూడా ఉంటాయి. వెంట ఉండే కమాండోలు, వైట్ హౌస్ కు ఎక్కడి నుంచైనా మాట్లాడే శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ, ప్రత్యేకమైన భోజనం - ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా మొదటి పౌరుడికి ఉండే ప్రాధాన్యత మాటల్లో చెప్పలేం. ఇన్ని సౌకర్యాలు ఉండే అమెరికా అధ్యక్షుడి కారుకి కూడా ప్రత్యేకత ఉందండోయ్.

ఎందుకంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు 45వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ కారును ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ కేడిలాక్ మోటార్స్ తయారు చేస్తోంది. బీస్ట్ గా పిలవబడుతున్న ఈ కారు తయారీ ఇప్పటికే పూర్తయిందట. అయితే కేవలం ఒక కారు మాత్రమే కాకుండా ఇలాంటివే మరో 12 కార్లను అమెరికా అధికారులు తయారు చేస్తున్నారంటే, అందులో వుండే స్పెషాలిటీస్ తెలుసుకోవాల్సిందే కదా. మరి అవేమిటో చూద్దాం...

1/13 Pages

1. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించనున్న బీస్ట్ కారును అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, గతంలో లేని విధంగా పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్లను ఈ కారులో అందిస్తున్నారు. ముందుభాగంలో అధునాతన కేడిలాక్ ఎస్కలేటెడ్ ఎస్ యూవీ శ్రేణి తరహాలో బీస్ట్ కారు రూపొందిస్తున్నారు.

English summary

Mind blowing features in Donald Trump car