రైల్వేస్టేషన్లలో 1రూ. కే మినరల్ వాటర్

Mineral water one rupee at railway station

12:22 PM ON 1st July, 2016 By Mirchi Vilas

Mineral water one rupee at railway station

వాటర్ పొల్యూషన్ కారణంగా చాలామంది మినరల్ వాటర్ వైపే మొగ్గు చూపుతున్నారు. వాటర్ బాటిల్ రేటు దారుణంగా ఉన్నప్పటికీ ఆరోగ్య రీత్యా కొంటున్నారు. అయితే తక్కువ ఖర్చులోనే రైల్వే ప్రయాణికులకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రూపాయికి 300 మిల్లీలీటర్ల మినరల్ వాటర్ అందించనుంది. ఇప్పటికే ఉత్తర దేశంలో కొన్నిచోట్ల రైల్వే క్యాటరింగ్ కార్పొరేషన్ విజయవంతంగా దీనిని అమలుచేస్తోంది. ఇప్పుడు దీనిని ఆంధ్రప్రదేశలో కూడా ప్రా రంభించేందుకు క్యాటరింగ్ కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. ఏపీ ప్రభుత్వం తో చర్చలు జరుపుతోంది. ఢిల్లీలో ఇందుకు సంబంధించిన చర్చలు ప్రాథమికంగా చర్చలు జరిగాయి. అయితే రైల్వే స్టేషన్లలో వీటి నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. తొలివిడతలో 70మంచినీటి కేంద్రాలు ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వేక్యాటరింగ్ కార్పొరేషన అందిస్తుంది. నిర్వహణను డ్వాక్రా సంఘాలు చూసుకోవాల్సి ఉంటుంది. వచ్చేవారంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

ఇది కూడా చూడండి: హీరోలు వారి పిల్లలు

ఇది కూడా చూడండి: పరగడుపున నీళ్ళు తాగితే ఏం జరుగుతుందో తెలుసా!

ఇది కూడా చూడండి: అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కారణాలు ఇవే

English summary

Mineral water one rupee at railway station