గాలి కూతురు పెళ్లిని తలదన్నేలా ఇంకో పెళ్లి!!

Minister doing his son marriage grandly than Gali daughter

11:00 AM ON 22nd November, 2016 By Mirchi Vilas

Minister doing his son marriage grandly than Gali daughter

బళ్ళారి గనుల రారాజుగా వెలిగిన కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్ధనరెడ్డి కూతురి పెళ్లి ఈ నెల 16న ఘనంగా జరగడం, పలువురు చర్చించుకోవడంతో పాటు విమర్శల పాలవ్వడం కూడా తెలిసిందే. ఎందుకంటే, ఈ పెళ్లికి వందల కోట్లు ఖర్చయిందని అంచనా వేశారు. పెద్ద నోట్ల రద్దుతో జనం నానా పాట్లు పడుతుంటే గాలి ఇంత డబ్బు ఖర్చు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడ్డాయి. బీజేపీనే గాలికి కొమ్ము కాస్తుందని మండిపడ్డాయి కూడా. కాంగ్రెస్ కూడా ఈ విషయంలో కాస్త గట్టిగానే ప్రశ్నించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నోటికి తాళం పడిందా అన్నట్టుగా మరో వ్యవహారం వచ్చిపడింది.

1/3 Pages

గాలి జనార్థనరెడ్డి కూతురి పెళ్లి కంటే ఘనంగా కర్ణాటకలో మరో పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లి ఏకంగా అక్కడి అధికార పార్టీ కాంగ్రెస్ లోని మంత్రి కొడుకుది కావడం విశేషం. కర్ణాటకలోని చిన్నతరహా పరిశ్రమల మంత్రి రమేష్ జర్కిహొలి తన కొడుకు సంతోష్ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయబోతున్నారు. ఈ పెళ్లి కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లి మండపాన్నే రెండు ఎకరాల్లో నిర్మిస్తున్నారు.

English summary

Minister doing his son marriage grandly than Gali daughter