మంత్రి మాణిక్యాలరావుకి అవమానం జరిగిందా?

Minister Manikyala Rao was insulted

04:21 PM ON 16th June, 2016 By Mirchi Vilas

Minister Manikyala Rao was insulted

సోమ్యంగా ఉంటూ తన పని తాను చేసుకుపోయే దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఉన్నట్టుండి బరస్టయ్యారు. ఫలితంగా ఎపి సిఎమ్ చంద్రబాబుకి ఫిర్యాదు చేసారు. టిడిపితో ఏర్పడిన పొత్తు కారణంగా బిజెపి టికెట్ పై తాడేపల్లి గూడెం నుంచి పోటీచేసి గెలిచిన ఈయనకు బాబు కేబినెట్ లో మినిస్టర్ హోదా దక్కింది. ఈయన నియోజక వర్గంలో తరచూ టిడిపి వాళ్ళ, ముఖ్యంగా జెడ్పీ చైర్మన్ జోక్యం పెరిగిపోయిందట. నాకు ఈ పదవి అక్కర్లేదు. రాజీనామాకు సిద్ధంగా ఉన్నా. నా నియోజకవర్గంలోనే అవమానపరుస్తున్నారు. ఇంకా నేను ఈ పదవిలో ఉండడం అనవసరం.

నాకు పదవి ఉన్నా లేకపోయినా జనం కోసం పనిచేస్తా అంటూ ఆయన నేరుగానే అల్టిమేటం జారీ చేసారు. ఇంకేముంది తాడేపల్లిగూడెంలో టీడీపీ-బీజేపీల మధ్య వివాదం మరోసారి భగ్గుమంది. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం అలెర్ట్ అయింది. బుధవారం ఉదయం మంత్రి మాణిక్యాలరావు రాజీనామా అల్టిమేటం ఇవ్వడంతో ముందుగా సీఎంవో కార్యదర్శి సతీష్ చంద్ర, మంత్రి మాణిక్యాలరావుతో ఈ విషయం పై నేరుగా చర్చించారు. తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, సీఎం చంద్రబాబు గురువారం మీతో చర్చిస్తారని ఆయన వివరించారు. కానీ తన సొంత నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు నిత్యం జోక్యం చేసుకుంటున్నారని, శంకుస్థాపనలు,

ప్రారంభోత్సవాల విషయంలో తన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయం ఇంతకుముందే సీఎం దృష్టికి తీసుకువెళ్లామని సతీష్ చంద్రకు మంత్రి వివరించే ప్రయత్నం చేశారు. మంత్రి రాజీనామా అల్టిమేటం ఇచ్చిన దృష్ట్యా వివాదం మరింత ముదరకుండా మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. మీతో, జడ్పీ చైర్మన్ బాపిరాజుతో సీఎం స్వయంగా మాట్లాడతారు. విజయవాడకు రండి అని సీఎంవో నుంచి మాణిక్యాలరావుకు స్పష్టమైన సందేశం అందింది. మొత్తానికి టిడిపి-బిజెపి నడుమ పొత్తు అనేది బలవంత వ్యవహారంలా నడుస్తోందని చెప్పక తప్పదేమో.

English summary

Minister Manikyala Rao was insulted