చైనా వస్తువులు కొనవద్దని ప్రజలకు పిలుపిచ్చిన మంత్రి

Minister says that don't by China items

01:18 PM ON 5th October, 2016 By Mirchi Vilas

Minister says that don't by China items

ఇన్నాళ్లూ చైనా వస్తువులు మార్కెట్ లో దూసుకుపోయాయి. కానీ ఇప్పుడు బ్రేక్ పడబోతున్నాయి. అవును నిజం. చైనా వస్తువులు కొనవద్దని ప్రజలకు ఓ మంత్రి ఏకంగా పిలుపునిచ్చారు. దసరా, దీపావళి పండగలకు భారత్ లో తయారయ్యే సామాగ్రిని వినియోగించాలని ఆయన సూచించారు. పాకిస్థాన్ ఉగ్ర దాడులకు ప్రతీకారంగా ఆ దేశానికి సింధు నదీ జలాల నిలిపివేతపై భారత్ కసరత్తు చేస్తోంది. అయితే పాక్ కు మద్దతిస్తున్న చైనా భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలకు నీరందించే బ్రహ్మపుత్ర ఉప నదికి అడ్డుకట్ట వేస్తున్నట్లు గత వారం ప్రకటించింది. దీనికి నిరసనగా అసోం సీనియర్ మంత్రి హిమంత్ బిశ్వ శర్మ చైనా వస్తువులు కొనవద్దని ప్రజలను కోరారు.

గత నెలలో అసోమ్ కు చెందిన హిందూ యువజన సంఘం కూడా చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. అయితే చైనా మద్దతుతో ఆ రాష్ట్రంలో చెలరేగిపోతున్న ఉల్ఫా ఇండిపెండెంట్ అనే తీవ్రవాద సంస్థ ఇలాంటి ప్రచారం చేయవద్దని హిందూ సంస్థ నేతలను హెచ్చరించింది. ఈనేపథ్యంలో బీజేపీకి చెందిన ఆ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, విద్యాశాఖల మంత్రి హిమంత్ బిశ్వ శర్మ చైనా వస్తువులను బహిష్కరించాలని అధికారికంగా ప్రజలకు పిలుపునివ్వడం సహజంగానే సంచలనం కల్గించింది.

English summary

Minister says that don't by China items