బాలికపై అత్యాచారం-మర్డర్-చెట్టుకు వేలాడదీశారు!

Minor Girl Raped And Murdered In Krishna District

11:56 AM ON 20th April, 2016 By Mirchi Vilas

Minor Girl Raped And Murdered In Krishna District

ఎన్ని చట్టాలు వచ్చిన ఏం లాభం , నిర్భయ వున్నా ఏమి ఫలితం ... రోజూ ఎక్కడో చోట మహిళలపై , బాలికలపై అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. పెట్రేగి పోయేవాళ్లకు అడ్డూ అదుపూ లేదు ... తాజాగా మరో విషాద కర దుర్ఘటన చోటుచేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ.. తమ కంటిపాపను రెండు మృగాలు కాటేసి, నిర్దాక్షిణ్యంగా పొట్టనబెట్టుకున్నాయి. దీంతో ఆ తల్లిదండ్రుల శోకానికి అంతేలేదు. పత్తి చేలో నిర్జీవంగా పడి ఉన్న కుమార్తెను చూసి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కంటికి రెప్పలా పెంచుకున్న తమ కుమార్తెను దారుణంగా అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటన ఏటూరు, విపరింతలపాడు గ్రామాల ప్రజలను కలచి వేసింది. పట్టపగలు యువతిని బలవంతంగా తీసుకువెళ్లడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చందర్లపాడు మండలంలో సంచలనం కలిగించిన బాలికపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి, వివరాలిలా వున్నాయి.

ఇవి కూడా చదవండి : సంగీతానికి థమన్ గుడ్ బై!

కృష్ణా జిల్లా ఏటూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి పనులు చేసే రేపాకుల శ్రావణిని సమీపంలోని విపరింతలపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌, మరో బాలుడు కలిసి అత్యాచారం చేసి హత్య చేశారు. ఏటూరుకు చెందిన రేపాకుల నరసింహారావు, నాగలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వ్యవసాయ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమార్తెకు పెళ్లి చేయగా, రెండో కుమార్తె పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారు. మూడో కుమార్తె శ్రావణి(15) తొమ్మిదో తరగతి వరకు చదివింది. ఆర్థిక స్థోమత లేనందున చదువు ఆపేసి, తల్లిదండ్రులతో కూలి పనులకు వెళుతోంది. ఆదివారం కూలి పనులకు వెళ్లిన శ్రావణి మధ్యాహ్నం ఇంటికి వచ్చే సమయానికి తల్లిదండ్రులు వేరే ఊరు వెళ్లారు.

ఇవి కూడా చదవండి :విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్

ఇంట్లో శ్రావణి ఒక్కతే ఉండటాన్ని గమనించిన విపరింతలపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ ఎస్‌కె.నాగుల్‌మీరా మరో బాలుడితో కలసి శ్రావణిని బలవంతంగా ఆటో ఎక్కించి ఊరి బయట ఉన్న పత్తి చేలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసారు. అంతటితో ఆగలేదు. గొంతునులిమి చంపేశారు. ఉరివేసుకున్నట్లు చిత్రీకరించేందుకు ఆమెను చెట్టుకు వేలాడదీశారు. సోమవారం ఉదయం పంట పొలాల్లో గాలిస్తున్న గ్రామస్థులకు నాగుల్‌మీరా, బాలుడు మద్యం తాగుతూ కనిపించారు. గ్రామస్థులు వారిని పట్టుకుని నిలదీయడంతో ఈ సంఘటన బయటపడింది. దీంతో గ్రామస్థులు పోలీసులకు నిందితులను అప్పగించారు. నందిగామ డీఎస్పీ రాధే్‌షమురళి, రూరల్‌ సీఐ సత్యకిషోర్‌, ఎస్సై దుర్గాప్రసాద్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి :

చిన్నారిని చిత్రహింసల కు గురిచేసిన పేరెంట్స్

ఇవి లేకుండా మన డైరెక్టర్లు సినిమా తీయలేరు

English summary

A Minor Girl in Krishna District was kidnapped and then Raped her and Murdered in Krishna District. Later The Villagers Caught the Accused persons and they were arrested by the Police.