మైనర్ బాలికపై ... మరీ ఇంత దారుణమా!

Minor Girl Raped And Murdered In UP

12:34 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Minor Girl Raped And Murdered In UP

నిర్భయ లాంటి కఠిన చట్టం వచ్చినా, సభ్యసమాజం తలదించుకునే అకృత్యాలు ఆగడం లేదు. ఆడ పిల్లలకు రక్షణ కరువైంది. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని భారైచ్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. బహిర్భూమికి వెళ్లిన 15 సంవత్సరాల బాలికపై కామాంధులు తెగబడ్డారు. పొలాల్లోకి బహిర్భూమికి వెళ్లిన బాలికను తీసుకెళ్లి ఆమె జీవితాన్ని తెల్లవారకముందే చీకట్లలోకి నెట్టేశారు. బహిర్భూమికి బయటకు వెళ్లిన తమ కూతురు ఇంటికి ఇంకా రాకపోవడంతో తల్లిదండ్రులు కూతురును వెతుక్కుంటూ పొలాల్లోకి వెళ్లారు. పొలంలోని ఓ చెట్టుకు వేలాడుతున్న తమ కూతురిని చూసి కన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె శరీరం నుంచి రక్తస్రావం కూడా ఆగడంలేదు. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి కొంతమంది యువకులపై వారు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:బెట్టింగ్ లో ఓడిపోయాడని భార్యను తాకట్టు పెట్టేసాడు! ఆమె ఏం చేసిందో తెలుసా?

ఇవి కూడా చదవండి:డేర్ ఉంటే నైట్ టైం ఈ హర్రర్ మూవీస్ ఒంటరిగా చూడండి

`

English summary

A 15 Year Minor Girl in Uttar Pradesh who was went to natural calls was raped and Hanged to a tree in Uttar Pradesh. Later she was found by her parents and they complained in police station about this incident.