గ్యాంగ్‌రేప్‌ చేసి...వీడియో పంపారు

Minor’s gangrape and shared video on whatsapp

03:03 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Minor’s gangrape and shared video on whatsapp

ముంబాయికి చెందిన ఒక 15ఏళ్ల మైనర్‌ బాలికను, నలుగురు మైనర్‌ కుర్రాళ్ళు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదీ కూడా అత్యాచారానికి గురైన బాలిక బంధువు ఒకరు రేప్‌ వీడియోను వాట్సాప్‌లో అనుకోకుండా చూసిన తర్వాత ఈ ఉదంతం తెలియవచ్చింది. ఈ నెల నవంబర్‌ 8న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. పదవ తరగతి చదువుతున్న ఈ బాలికను స్థానికంగా ఉన్న మరో నలుగురు కుర్రాళ్ళు అత్యాచారానికి పాల్పడి, దాన్ని వీడియోను తీసి బాలికను చంపేస్తామని బెదిరించడంతో బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పలేకపోయింది. అయితే ఈ రేప్‌కు సంబంధించిన క్లిప్పింగును నలుగురు కుర్రాళ్ళు వాట్సాప్‌లో పోస్ట్‌ చేసారు. ఆ వీడియో అలా అనుకోకుండా రేప్‌కు గురైన బంధువుకు చేరింది. దీంతో వెంటనే సదరు కుర్రాళ్ళపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసారు.

English summary

15-year-old girl in Mumbai and circulating a video of the assault on WhatsApp, a crime that came to light after the victim’s aunt stumbled upon a clip of the incident on her phone.Four minors have been arrested on charges of gangraping.