మంత్రి గారి ఆధ్వర్యంలో అశ్లీల నృత్యాలు(వీడియో)

Minsiter is the chief guest for recording dances

12:38 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Minsiter is the chief guest for recording dances

మన నేతలు గిరిజనులతో కల్సి సంప్రదాయ నృత్యం చేయడం వంటివి ఎప్పటినుంచో వున్నాయి. అయితే రానురాను అసభ్యకర నృత్యాల్లో సైతం అమాత్యులు భాగస్వాములవుతున్నారు. ఇక మనం చూసే ఈ వ్యక్తి కూడా మామూలు మనిషి కాదు, కేంద్ర మంత్రి. ఎంతో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఈయన తన పదవిని సక్రమంగా నిర్వహించడం ద్వారా దానికి వన్నె తేవాల్సిన అవసరం వుంది. కానీ, ఆయన అసభ్యకరమైన పనికి మద్దతు తెలపడంతో పాటు వాటిని పొగడడం పలు విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తు కేంద్రమంత్రి ప్రధాన అతిథిగా పాల్గొన్న ఓ వేడుకలో మహిళా డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలు చేయించిన ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్ నయిన్ పూర్ జిల్లాలోని పిప్రియా గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. గోండు రాజులు శంకర్ షా, రఘునాథ్ షా సంస్మరణార్థం నిర్వహించిన సాంస్కృతిక వేడుకలో డ్యాన్సర్లు అసభ్య, అశ్లీల నృత్యాలు చేశారు. ఛత్తీస్ గఢ్ నుంచి ప్రత్యేకంగా రప్పించిన డ్యాన్సర్లు అశ్లీల నృత్యాలు చేయడం వివాదం రేపింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి, మధ్యప్రదేశ్ ఎంపీ ఫగన్ కులస్తే హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే ఛత్తీస్ ఘడ్ నుంచి వచ్చిన డ్యాన్సర్లు అసభ్య నృత్యాలతో పాటు అసభ్య భంగిమలతో రెచ్చిపోయారు. సదరు కేంద్రమంత్రి కులస్తే మాట్లాడుతూ గిరిజన సంస్కృతిలో ఇలాంటి డ్యాన్సులు భాగమని, ప్రజలు వీటిని ఇష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు.

రాత్రుళ్లు ప్రజలు మెలుకువ ఉండటానికి ఇలాంటి డ్యాన్స్ ప్రదర్శనలు అవసరమని కూడా సెలవిచ్చారు. ఆయన గతంలో కూడా ఇలాంటి డ్యాన్స్ వేడుకల్లో పాల్గొన్నారు. అశ్లీల నృత్యాలను పొగిడిన కేంద్ర మంత్రి తీరుపై ఎంపీలో పెద్ద ఎత్తున విమర్శలు రేగుతున్నాయి.

English summary

Minsiter is the chief guest for recording dances