బాహుబలికి జోడీగా మిస్ ఇండియా?

Miss India Aditi Arya is pairing with Prabhas

12:44 PM ON 3rd August, 2016 By Mirchi Vilas

Miss India Aditi Arya is pairing with Prabhas

అవునా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. యంగ్ రెబల్ స్టార్ కి జోడీగా అంటే మాటలు కాదుకదా. ప్రభాస్ కి హీరోయిన్ ఓ రేంజ్ లో ఉండాలని ఆలోచించడం సబబే అని చెప్పాలంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల కొరత వుంది. అందం, అభినయం గల కొత్త హీరోయిన్లు లేకుండా పోయారు. ఇది ఎప్పటినుంచో వుంది. అందుకే ముంబాయ్ భామలను టాలీవుడ్ కి ఎరువు తెస్తున్నారు. ఇక ప్రభాస్ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేస్తారనే సందేహం అందరికీ వస్తోంది. ఫాన్స్ అయితే తెగ ఆరాట పడుతున్నారు. అయితే మనోళ్లు మాత్రం హ్యాపీగా కొత్త రూటులో వెళ్తున్నారట.

కళ్యాణ్ రామ్ కు మిస్ ఇండియా అదితి ఆర్యాను సెట్ చేసిన పూరి జగన్నాధ్, ఇక రాజ్ తరుణ్ కు అమైరా దస్తూర్ ను హీరోయిన్ గా మార్చిన ఛార్మి కూడా ఇప్పుడు ప్రభాస్ కోసం పిల్లను వెతికే పనిలో ఉన్నట్లు టాక్. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే.. ప్రభాస్ బాహుబలిని కంప్లీట్ చేస్తుండడంతో పాటే తర్వాతి మూవీకి కూడా ఏర్పాట్లు చకచకా చేసుకుంటున్నాడు. ఇప్పటికే జిల్ దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ లవ్ స్టోరీని ఫైనల్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్తమ్మాయిని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కంటే.. కొత్తమ్మాయిని తీసుకోవాలనే ఆలోచన ఉంది. అందరూ కొత్త హీరోయిన్ నే ప్రిఫర్ చేస్తుంది. ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి.

కొన్నివారాల్లో హీరోయిన్ ని ఫైనల్ చేసి.. అనౌన్స్ చేస్తాం అని దర్శకుడు రాధాకృష్ణ చెబుతున్నాడు. ఇప్పటికే పూరీ జగన్నాథ్ కాస్టింగ్ ఏజన్సీ నుంచి కొందరు అమ్మాయిలను పరిశీలిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. మరోవైపు మిస్ ఇండియా కంటెస్టెంట్ లను కూడా ప్రభాస్ కు జోడీగా నటింపచేసేందుకు కసరత్తు చేస్తున్నారట. అయితే అన్ని రకాలుగాను జోడీ కుదిరాకే హీరోయిన్ ని ఫిక్స్ చేస్తామని దర్శకుడు స్పష్టం చేస్తున్నాడు. మరి ప్రభాస్ జోడీ ఎక్కడ వుందో అంటూ కామెంట్స్ పడిపోతున్నాయి.

English summary

Miss India Aditi Arya is pairing with Prabhas