ఛాన్స్ ఇస్తే చాలు చూపిస్తా ...

Miss India Earth Sobhita Ready To Act In Tollywood

10:34 AM ON 22nd July, 2016 By Mirchi Vilas

Miss India Earth Sobhita Ready To Act In Tollywood

అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన రమణ్ రాఘవ్ 2.0 తో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసి తన అద్భుత నటనతో ఆకట్టుకున్న తెలుగమ్మాయి, మిస్ ఇండియా ఎర్త్ శోభిత ధూళిపాళ అక్కడ అవకాశాలు వచ్చిపడుతున్నట్లు టాక్. గుంటూరుకు చెందిన శోభిత తన మనసులో మాట బయట పెట్టింది. హీరోయిన్లను ముంబై, కేరళల నుంచి ఇంపోర్ట్ చేసుకొనే టాలీవుడ్ దర్శకనిర్మాతలకు గ్లామరస్ గా కనిపించడానికి సిద్ధమని శోభిత కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఫొటో షూట్ తో చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు.

టాలీవుడ్ కి తెలుగు హీరోయిన్లు కావాలని చాలామంది అంటుంటారని, కానీ వాస్తవంగా ఆ మాటలు చెప్పేవాళ్లు అవకాశాలు ఇవ్వరని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అంటోంది. ఇండస్ర్టీలో పని చేయడానికి ఆసక్తివున్నా ఫలితం లేకపోయిందని చెప్పుకొచ్చింది.

తనలాంటి వాళ్లు వేరే పరిశ్రమలకు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారంటే కేవలం ఫ్యాషన్ ఉండబట్టే కదా అని అంటోంది. బ్యాక్ గ్రౌండ్ లేని 23 ఏళ్ల అమ్మాయికి అవకాశమిస్తే తానేంటో చూపించగలను తప్ప ఇంకేమి చేయగలనని శోభిత అమాయకపు చూపులతో చెప్పేస్తోంది. తనకిప్పుడు బాలీవుడ్ లో మంచి అవకాశాలే వస్తున్నాయని, ఏదో ఒకరోజున టాలీవుడ్ లో ఛాన్స్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. మరి ఆమెకు ఆఫర్ ఎవరు ఇవ్వబోతున్నారావు చూడాలి.

ఇవి కూడా చదవండి:బెల్లీ డాన్సర్ గా మారిపోయిన కుమారి!

ఇవి కూడా చదవండి:ఫోటోషూట్ తో మతి పోగొడుతున్న పవన్ ఐటమ్ బాంబ్!

English summary

Telugu Model Sobhita was acted in Raman Raghav 2.0 in Bollywood and she said in a recent interview that she was ready to act in Tollywood Movies. She also said that she was getting good offers in Bollywood.