మాజీ మిస్ వరల్డ్ లోపేజ్ కన్నుమూత

Miss world Yumara Lopez was expired

03:15 PM ON 23rd June, 2016 By Mirchi Vilas

Miss world Yumara Lopez was expired

మాజీ మిస్ వరల్డ్ యుమారా లోపేజ్(22) కన్నుమూశారు. కొంతకాలంగా బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె నికరాగువా రాజధాని మనాగువాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. 2014లో లండన్ లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో యుమారావిజేతగా నిలిచారు. ఆ తర్వాత ఆమెకు బ్రెయిన్ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. విపరీతమైన తలనొప్పి, కళ్లు సరిగా కనిపించకపోవడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా... బ్రెయిన్ క్యాన్సర్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటికే క్యాన్సర్ రెండో స్టేజ్ లో ఉండడంతో మృత్యువుతో పోరాడుతూ యుమారా తుది శ్వాస విడిచింది.

English summary

Miss world Yumara Lopez was expired