భవనం పై కూలిన క్షిపణి

Missile collapsed on the building

06:00 PM ON 16th December, 2015 By Mirchi Vilas

 Missile collapsed on the building

రష్యాలో ఓ దుర్ఘటన జరిగింది. అతి తక్కువ ఎత్తులో ప్రయాణం చేసే ఓ క్షిపణి ఒక భవనంపై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రష్యా రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. సైనిక శిక్షణలో భాగంగా దానిని ప్రయోగించగా.. ప్రయోగం విఫలం కావడంతో ఈ ఘటన చోటుచేసుకుందని వారు చెప్పారు. మిసైల్‌ దారితప్పి రష్యా రాజధాని మాస్కోకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యోనోస్కా పట్టణానికి సమీపంలోని ఓ భవనంపై పడిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటన కారణంగా రెండంతస్థుల భవనం పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు చెప్పారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు.

English summary

A missile was blasted on the building when russia fired that missile targetted on Syria.No one harmed in this missile blasting