మిసోరీని ముంచిన మిసిసిప్పీ

Mississippi River Flows In America

06:35 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Mississippi River Flows In America

అమెరికాలో మిసిసిప్పీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మిసోరి రాష్ట్రం పూర్తిగా నీటమునిగిపోయింది. నీటి ఉధృతి ప్రమాదరకర స్థాయిని దాటడంతో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల కురిసిన వర్షాలు, టోర్నడోలు బీభత్సం సృష్టించడంతో నదులన్నీ ఉగ్ర రూపం దాల్చాయి. దాంతో చాలా ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. వరదల వల్ల సుమారు 13 మంది చనిపోయినట్లు మిసోరీ రాష్ట్ర గవర్నర్ జే నిక్సన్ తెలిపారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ గార్డ్స్ సాయం తీసుకుంటోంది. నదుల్లో నీటి ప్రవాహం మరింత పెరుగుతుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మిసోరీ రాష్ట్ర గవర్నర్ ముందే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటివరకు అమెరికాలో టోర్నడోల వల్ల చనిపోయిన వారి సంఖ్య 49కి చేరుకుంది.

English summary

Mississippi River in America Flows Dangerously. Due to these floods up to now 13 people were died .