బ్రేకింగ్ న్యూస్: రూ. 500 కొత్త నోటులో తప్పిదాలు(వీడియో)

Mistakes in new 500 rupees currency

11:21 AM ON 26th November, 2016 By Mirchi Vilas

Mistakes in new 500 rupees currency

పెద్దనోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం కొత్తగా రెండువేల నోటు, 500 నోట్లు ప్రవేశపెట్టింది. అయితే రెండు వేల నోట్లు విస్తృతంగా చెలామణిలోకి వచ్చినా, ఇంకా చాలాచోట్లకు 500 నోట్లు రాలేదు. అయితే చావు కబురు చల్లగా మోసుకొచ్చిన చందంగా కొత్త 500నోట్లలో చిన్నచిన్న తప్పులు ఉన్నాయంటూ ఆర్బీఐ చెప్పి, అందరికి షాకిచ్చింది. అత్యవసరంగా రూ.500 నోట్లను ప్రింట్ చేయడం వల్ల సమస్యలు ఏర్పడ్డాయని ఆర్బిఐ అంటోంది. ఒకే డినామినేషన్ లో రెండు రకాలుగా నోట్లు వచ్చాయని చెప్పిన ఆర్బిఐ, అయితే ఆ రెండు వేల నోట్లు చెల్లుతాయని స్పష్టం చేసింది. ఇన్ని విషయాలు చెబుతూ ఇందులో ఎలాంటి కంగారపడవద్దని... ఆందోళన అవసరం లేదని ప్రజలను కోరింది.

1/4 Pages

ఆర్బీఐ పంపిన నోట్లలో ఒక నోటుకు, మరో నోటుకు మధ్య తేడాలు కనిపించాయి. కొన్ని నోట్లలో గాంధీ బొమ్మ నీడలు కనిపించాయి. అలాగే జాతీయ చిహ్నం, సీరియల్ నెంబర్ అలైన్మెంట్లలో తేడాలు ఉన్నాయి. అయితే వీటిని మామూలుగానే ఉపయోగించవచ్చని తదుపరి నోట్లలో పొరపాట్లను సవరించుకుంటామని ఆర్బీఐ చెప్పింది.

English summary

Mistakes in new 500 rupees currency