జుట్టు పెరుగుదల ఆగిపోవటానికి కారణాలు

Mistakes that will stop hair growth

03:59 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Mistakes that will stop hair growth

సాదారణంగా మహిళలు అందరూ అందమైన మెరిసే జుట్టు కావాలని కోరుకుంటారు. అయితే జుట్టును శుభ్రం చేసుకోవటం, అరబెట్టటం మరియు జుట్టు స్టైలింగ్ లో సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే సాధ్యం అవుతుంది. మంచి పలితాన్ని సాదించటానికి వారు తమ తల్లితండ్రులు మరియు ఇరుగు పొరుగు వారిని సలహాలు అడుగుతూ ఉంటారు. కానీ అవి అన్ని సమయాల్లోనూ మంచి పలితాలను ఇవ్వక, జుట్టు చివరలు చిట్లుట, బలహీనమైన జుట్టు, పొడి జుట్టు, చుండ్రు వంటి సమస్యలకు కారణం అవుతుంది. జుట్టు సంరక్షణ పద్దతులను అర్ధం చేసుకొని సాదారణంగా చేసే తప్పులను సరిదిద్దుకోవాలి.

సాదారణంగా మహిళలు చేసే తప్పులను హెయిర్ స్టైలిస్ట్ లు కనుగొన్నారు. షాంపూ తో తల రుద్దుకోవటం,జుట్టు కత్తిరించుకోవటం, జుట్టు ఉత్పత్తులు వాడటం వలన జుట్టు నష్టం వంటి కారణాల వలన జుట్టు పెరుగుదల ఆగిపోతుందని హెయిర్ స్టైలిస్ట్ లు అంటున్నారు.

1/11 Pages

అత్యంత సాదారణంగా చేసే కొన్ని తప్పులు

1. జుట్టుకు ఎక్కువ వేడి ఉండకూడదు

ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు హెయిర్ డ్రైయిర్, కర్లింగ్ రాడ్, జుట్టు స్టైలింగ్ కొరకు ఫ్లాట్ రాడ్ వంటి వేడి ఆధారిత ఉపకరణాలను ఉపయోగిస్తున్నారు. ఈ వేడి కారణంగా జుట్టు చివర్లు చిట్లిపోవటం మరియు జుట్టు రంగు పాలిపోవటం వంటివి జరుగుతాయి. చాలా మంది మహిళలు జుట్టు నాశనం అవుతుందని గ్రహించకుండా చేసే తప్పులలో ఇది ఒకటి. వేడి ఉపకరణాలను వాడకుండా నిరోదించాలి. ఒకవేళ వాడవలసి వస్తే కనుక తక్కువ  వేడిలో ఉపయోగించటం మంచిది.

English summary

Most women crave for shiny gorgeous hair. Hair stylists have tried to find some common mistakes that is made by women