రతన్ టాటాపై మిస్త్రీ సంచలన వ్యాఖ్యలు

Misthri sensational comments on Rathan Tata

05:06 PM ON 27th October, 2016 By Mirchi Vilas

Misthri sensational comments on Rathan Tata

ఇండియా పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పై సంచలన ఆరోపణలు గుప్పుమన్నాయి. తన పనిలో తరచు జోక్యం చేసుకునే వారని, తనను తొలగించే విషయంలో డైరెక్టర్లు గౌరవప్రదంగా వ్యవహరించలేదని టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాజమాన్యాన్ని ఆయన తప్పు పట్టారు. చైర్మన్ పదవి నుంచి రెండ్రోజుల క్రితం ఉద్వాసనకు గురైన మిస్త్రీ బోర్డు సభ్యులకు ఈ మేరకు ఓ ఇ-మెయిల్ పంపారు. అర్థాంతరంగా తొలగించిన విధానం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. కనీసం తొలగించేందు ముందు నా వాదన వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. నన్ను తొలగించిన విధానం దేశంలో మునుపెన్నడూ జరగలేదు అని ఆయన పేర్కొన్నారు.

చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న ఆలోచనైతే ప్రస్తుతానికి లేదు. ఐదు వ్యాపారాలు నష్టాల్లో ఉన్నందునే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అందువల్లే టాటా ఆస్తుల్లో అంచనా వేసిన దానికంటే 18 బిలియన్ డాలర్లు తగ్గాయి. నేను చైర్మన్ పదవిని చేపట్టినప్పటి నుంచి రతన్ టాటా తరచు జోక్యం చేసుకునేవారు అని మిస్త్రీ ఆరోపించారు. ఉదాహరణ టాటా నానో తీవ్రమైన నష్టాల్లో ఉన్నందున తక్షణం దాన్ని మూసివేయాల్సి ఉందని, అయితే ఆ కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి భావోద్వోగ కారణాలే అడ్డుపడ్డాయని ఆయన వెల్లడించారు. తాజ్ చెయిన్ నడుపుతున్న ఇండియన్ హోటల్స్ సమస్యకు టాటానే బాధ్యులని విమర్శించారు. కాగా, ఇ-మెయిల్ వ్యవహారంపై వ్యాఖ్యానిచేందుకు మిస్త్రీతో పాటు టాటా సన్స్ ప్రతినిధులు నిరాకరించడం కొసమెరుపు.

English summary

Misthri sensational comments on Rathan Tata