కోహ్లీని దెబ్బతీస్తున్న ఆసీస్ మాజీ క్రికెటర్ ...

Mitchell Johnson About Kohli On Twitter

11:55 AM ON 28th March, 2016 By Mirchi Vilas

Mitchell Johnson About Kohli On Twitter

టీ20 వరల్డ్ కప్ లో ఇండియా దూసుకుపోతుంటే, మానసికంగా దెబ్బ కొట్టడానికి రంగం ప్రిపేర్ చేస్తున్నారా? అసలు ఆ అవసరం ఏమొచ్చింది? ఎవరు చేయిస్తున్నారు? ఆసీస్ మాజీ బ్యాట్స్‌మెన్ మిచెల్ జాన్సన్‌ను ఇందుకు పావుగా వాడు కుంటున్నారా? ముఖ్యంగా టీమిండియా సూపర్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం ఆసీస్ లక్ష్యమా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమొచ్చే విధంగా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒకరిని పొగడడం ద్వారా మరొకరి ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనే కుట్ర ఇందులో కనిపిస్తోంది. అందుకు బలం చేకూర్చేలా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరైన ఆసీస్ బౌలర్ మిచెల్ జాన్సన్ ట్వీట్లు వున్నాయి. ఇవే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇంతకీ విషయమేమంటే, ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో ధోనీ, ఏబీ డివిలియర్స్, స్మిత్, రూట్, విలియమ్‌సన్ టాప్ 5 బ్యాట్స్‌మెన్స్ అంటూ జాన్సన్ ఓ ట్వీట్ పెట్టాడు. ఈ ట్వీట్‌పై కోహ్లీ అభిమానులు కారాలు మిరియాలు నూరుతున్నారు.

ఇవి కూడా చదవండి : బక్కచిక్కిన గోదారి-బయటపడ్డ ఆలయాలు

సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీని జాన్సన్ ప్రస్తావించకపోవడం ఏంటని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఇదసలు పెద్ద విషయమే కాదని కోహ్లీ అంటున్నాడు. ఆసీస్‌తో తాను ఆడిన ప్రతీ మ్యాచ్ నుంచి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉన్నానని తెలిపాడు. జాన్సన్ కూడా కోహ్లీ పేరు చేర్చకపోవడంపై వివరణ ఇచ్చాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ ఫెయిలయ్యాడని... అందుకే చేర్చలేదని సర్ది చెబుతున్నాడు. కోహ్లీ అభిమానులు మాత్రం బ్యాటింగ్‌తో జాన్సన్ కామెంట్స్‌కు సరైన సమాధానం చెబుతాడని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి :

ధోనీని బూతులు తిడుతున్న యువరాజ్ తండ్రి

బికీనీ వేసిందని టీచర్ ఉద్యోగం పీకేసారు.. ఆ పై వ్యభిచారిగా..

'సర్దార్' లో షకలక శంకర్ ని తీసేసారా?

English summary

Star Player Virat Kohli trolled by Australian Fast Bowler Mitchell Johnson on his twitter account.Johnson tweeted that Dhoni,AB devillers,Root and Williamson was only the top Batsman in the world.