కామెడీ ట్రాక్ తో 'మిక్చర్ పొట్లం'

Mixture Potlam movie details

06:31 PM ON 9th August, 2016 By Mirchi Vilas

Mixture Potlam movie details

ఇదేమి మూవీ అనుకుంటున్నారా అవును ఇదో వెరైటీ చిత్రం. కొత్త నిర్మాతలు, పాత - కొత్త తారల కలయికతో కామెడీ జోడించి తీస్తున్న గోదావరి సినీ టోన్ వారి తొలి చిత్రం మిక్చర్ పొట్లం నిర్మాణం ఇంచుమించు పూర్తయింది. రికార్డింగ్ తదితర కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గోదావరి అందాలను చూపిస్తూ, అన్ని రసాలు సమపాళ్లలో రంగరించి, అమలాపురం - షిర్డీ బస్సు యాత్ర నేపథ్యంలో ఈ మూవీ రూపుదిద్దుకుంది. అలనాటి హీరో - కరాటే కింగ్ భానుచందర్ కుమారుడు జయంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో గీతాంజలి అనే కొత్త అమ్మాయి హీరోయిన్.

కాగా గత నాలుగేళ్లుగా టాలీవుడ్ కి దూరమైన కొత్త బంగారులోకం హీరోయిన్ శ్వేతా బసు కీలక భూమిక పోషిస్తోంది. భాను చందర్, సుమన్, పోసాని కృష్ణ మురళీ, కృష్ణ భగవాన్, జూనియర్ రేలంగి, చిట్టిబాబు, జబర్దస్త్ ఫణి, మురళి, అనిల్ తదితరులు నటిస్తున్నారు. ఓ ప్రత్యేక పాత్రలో సంపూర్ణేష్ బాబు కూడా నటించాడు. నిర్మాతలు డాక్టర్ కంటే వీరన్న చౌదరి, లయన్ డాక్టర్ లక్ష్మి ప్రసాద్ కూడా ఇందులో నటించారు. నూతన దర్శకుడు సతీష్ కుమార్ కధ అందించి స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించాడు. మాధవ పెద్ది సురేష్ సంగీతం సమకూర్చిన ఈ మూవీ యూనిట్ తొలి ప్రెస్ మీట్ రాజమహేంద్రవరంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేశారు. ఈ సినిమా ఇంటిల్ల పాధినీ అలరించే విధంగా ఉంటుందని, మేకర్స్ చెప్పారు. శ్వేతా బసు మాట్లాడుతూ, ఈ మూవీ ఓ రికార్డు సృష్టిస్తుందని చెప్పింది.

1/3 Pages

English summary

Mixture Potlam movie details