రోజాకు సరే , మరి నా సంగతేంటి?

MLA Anitha Press Meet On Roja Issue

11:49 AM ON 18th March, 2016 By Mirchi Vilas

MLA Anitha Press Meet On Roja Issue

నాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజాపై శాసనసభ చర్య తీసుకుంది. ఆ చర్యను హైకోర్టు నిలిపివేసిందని రోజాకు న్యాయం జరిగిందని ఆ పార్టీవారు అంటున్నారు. మరి నా హక్కులకు రక్షణ కల్పించేది ఎవరు? మరి నాకెవరు న్యాయం చేస్తారు. దళిత ఎమ్మెల్యేను ఎవరు ఏమన్నా వారిపై చర్య తీసుకోకూడదా? రోజా వ్యాఖ్యలు అన్యాయంగా ఉన్నాయని శాసనసభ నైతిక విలువల కమిటీ కూడా అభిప్రాయపడింది. నాపై ఆమె వ్యాఖ్యలు తప్పేనని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా నాతో అన్నారు. ఇవే విషయాలను రేపు (శుక్రవారం) సభలో లేవనెత్తుతాను. నాకు న్యాయం చేయాలని అడుగుతాను’ అని పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనిత స్పష్టంచేశారు.

గురువారం మధ్యాహ్నం అసెంబ్లీ లాబీల్లో, మీడియా పాయింట్లో ఆమె మాట్లాడారు. "రోజా శాసనసభలో నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతూ, సభ్యులు తల దించుకునేలా వ్యవహరించి, ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా వుంది' అని అనిత వ్యాఖ్యానించారు. చివరకు క్షమాపణ చెప్పడానికి కూడా ఇష్టపడని ఆమెకు వైసీపీ అధ్యక్షుడు జగన్ , ఆ పార్టీ ఎమ్మెల్యేలు వత్తాసు పలుకుతున్నారని ఆమె ఆరోపించారు.

గతంలో చట్టసభలు తీసుకున్న నిర్ణయాలపై కోర్టులు జోక్యం చేసుకున్నప్పుడు సభలు ఏ విధంగా స్పందించాయో.. ఆ విధంగానే ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభ కూడా స్పందిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు.న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడిన వైసీపీ నాయకులు ఇప్పుడు న్యాయవ్యవస్థను కీర్తిస్తూ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సభలో చంద్రబాబును న్యాయవ్యవస్థను మేనేజ్‌ చేసి తీర్పులు తెచ్చుకుంటారని ఆరోపించిన జగన్‌ ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. రోజాకు చట్టసభలపై గౌరవం ఉంటే.. అసెంబ్లీలో తాను చేసిన అసభ్యకర వ్యాఖ్యలన్నీ కోర్టు ముందు అంగీకరించాలని, అసెంబ్లీ తీర్పును శిరసావహించాలని ఏపీ మహిళా ఆర్థిక సహకార కార్పొరేషన చైర్మన్ పంచుమర్తి అనురాధ డిమాండ్‌ చేశారు.

English summary