కో మహిళా ఎంఎల్ఏ కొంప ముంచిన సెల్ఫీ

MLA Bhavna Jha selfie in controversy

04:24 PM ON 23rd September, 2016 By Mirchi Vilas

MLA Bhavna Jha selfie in controversy

ఓ వైపు బస్సు ప్రమాదం జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతే సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భావనా ఝా అక్కడో పని చేసి, చిక్కుల్లో ఇరుక్కున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బిహార్ లో మధుబనిలో ఈనెల 19వ తేదీన ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భావనా ఝా సెల్ఫీ తీసుకొని దాన్ని ఆమె ఫేస్ బుక్ లో పెట్టారు. ఆమె చేసిన పనిని బిజెపి తీవ్రంగా విమర్శిస్తోంది. ఈ విషయంపై ఎమ్మెల్యే భావన వాదన మరోలా ఉంది. క్షతగాత్రులకు కాపాడేందుకు వచ్చిన కొంత మంది యువత తనతో సెల్ఫీ దిగాలని ఆశపడ్డారని, దానికి నేను అంగీకరించాను తప్ప ఇందులో మరే ఉద్ధేశం లేదని ఆమె మీడియాకు వెల్లడించింది.

ప్రమాద బాధితులకు సహాయం చేసేందుకు రెస్క్యూ సిబ్బందితో కలిసి పనిచేశానని ఆమె అన్నారు. ప్రమాద స్థలంలో సెల్ఫీ తీసుకున్నందుకు ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవాలని బిహార్ రాష్ట్ర బిజెపి చీఫ్ ప్రతినిధి వినోద్ నారాయణ్ డిమాండ్ చేశారు. మానవ విషాదాలు ఇలాంటి వారికి పిక్నిక్ స్పాట్ లుగా మారాయని మండిపడ్డారు. ఆమె చేసిన చర్యపై బిహార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే భావనకు ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి మదన్ మోహన్ మద్దతుగా నిలిచారు. ఓ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసేందుకు ఆమె ప్రజల్లోకి వెళ్లారు. దాన్ని వదిలేసి ఫోటోలు తీసుకున్నారంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

English summary

MLA Bhavna Jha selfie in controversy