నేను గానీ నోరు విప్పానో .. ఇక షేకవ్వాల్సిందే

MLA Eknath Khadse Controversial Comments

11:23 AM ON 1st July, 2016 By Mirchi Vilas

MLA Eknath Khadse Controversial Comments

ఇది ఏదో సినిమా డైలాగ్ కాదు .. ఓ రాజకీయ నేత పంచ్ డైలాగ్ ఇది .. భూమికి సంబంధించిన డీల్స్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని తదితర ఆరోపణల కారణంగా ఆయన పదవికి మహారాష్ట్ర మాజీ మంత్రి ఏకనాథ్ ఖడ్సే రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. ఫడణవీస్ ప్రభుత్వం ఖడ్సేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. తాను నోరు విప్పితే దేశమంతా షేక్ అవుతుందని ఖడ్సే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పదవి నుంచి తప్పుకున్నాక దాదాపు నెల రోజుల తర్వాత బుధవారం సాయంత్రం ఖడ్సే తన నియోజకవర్గం జల్ గావ్ లో మద్దతుదారులనుద్దేశించి మాట్లాడితూ నాపై అవినీతి ఆరోపణలు కారణంగా రాజీనామా చేసినప్పటికీ నేను గనక నోరు తెరిస్తే దేశమంతా షేక్ అవుతుంది అని పేర్కొన్నారు.

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ పై కూడా ఖడ్సే స్వల్ప విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు భాజపా శివసేన కూటమి విడిపోవడానికి తానే కారణమని.. అయితే అందువల్లే గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి భాజపాకు దక్కిందని లేదంటే శివసేనకు దక్కి ఉండేదని ఖడ్సే పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానం బిజెపికి దక్కడంలో తనదే కీలక పాత్ర అన్నారు. కాగా ఆ రాష్ట్ర కేబినెట్ లో ఖడ్సే పలు కీలక పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి:ఆరేళ్ళ క్రితం కిడ్నాప్ అయ్యాడు..మరి ఇప్పుడు..

ఇవి కూడా చదవండి:వాడికి 17ఏళ్ళు ..అయినా వాడి పాడుబుద్ధి తెలిస్తే ..

English summary

Maharashtra Ex-Minister who had resigned to his minister post due to some illigations was made some comments that if he opens his mouth then the whole Country Will Shake.