వైసిపికి గ్రహణం పట్టిందా?

MLA Mani Gandhi Joins In TDP

01:09 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

MLA Mani Gandhi Joins In TDP

టిడిపి గూటికి ఎంఎల్ఎ మణిగాంధీ

వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి గ్రహణం పట్టిందా? పరిస్థతి చూస్తే, అలానే వుంది. ఆ పార్టీకి చెందిన ఒక్కొక్క ఎంఎల్ఎ ఫ్యాన్ గాలి వేసవిలో చాలదన్న చందంగా పార్టీకి గుడ్ బై కొట్టి సైకిలు ఎక్కేస్తున్నారు. ఇప్పటి వరకు 9మంది వైసిపిని వదిలి పెట్టగా, 6గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టిడిపిలో చేరారు. తాజాగా బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన నివాసంలో కర్నూలు జిల్లా కోడుమూరు వైకాపా ఎమ్మెల్యే మణిగాంధీ భేటీ అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మణిగాంధీకి చంద్రబాబు పార్టీ కండువా కప్పి టిడిపి లోకి ఆహ్వానించారు.

సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, టిడిపి నేతలు శిల్పా సోదరులు, పయ్యావుల కేశవ్‌, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, టీడీ జనార్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. దీంతో టిడిపి గూటికి వచ్చిన వాళ్ళు 7గురు లెక్క తేలారు. ఇక ఈనెల 4న టిడిపిలో చేరతానని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే వెంకటరమణ ఇప్పటికే ప్రకటించారు.

ఇంతకు ముందు టిడిపిలో చేరిన ఎంఎల్ఎలను ఇప్పుడు చూద్దాం...

English summary

Kurnool district Kodumuru MLA Mani Gandhi says good bye to Ysr Congress Party and Joined in Telugu Desam Party Chandrababu Naidu welcomes him into the party.Upto now 7 MLA's were joinedin Telugu Desam Party.Yesterday Srikakulam MLAalso announced that he was going to join in TDP.