అసెంబ్లీ అంటే  ఇదా .... సిగ్గు ... సిగ్గు 

MLA Roja Abusing Words In A.P.Assembly Video Released

01:27 PM ON 24th December, 2015 By Mirchi Vilas

MLA Roja Abusing Words In A.P.Assembly Video Released

ఒకప్పుడు చట్టసభలంటే హుందాతనానికి వేదికగా ఉండేవి. ప్రతిపక్ష సభ్యుడు ఒకడున్నా సరే , అధికార పక్షాన్ని తూర్పారబట్టేవారు. ఎవరు ఏ ప్రశ్న సందిస్తారో నని అధికార పక్షం భయపడేది. అసెంబ్లీ సమావేశానికి రావాలంటే చాలా హొమ్ వర్క్ జరిగేది. సిద్దాంత పరంగా విమర్శలు , ప్రతి విమర్శలు ఉండేవి. వ్యక్తిగత దూషణలు పొరపాటున ఎవరు చేసినా, అంతా ఖండించేవారు. సదరు సభ్యుడు కూడా పొరపాటు ని సరిదిద్దుకుని, బేషరతు క్షమాపణ చెప్పడానికి ఏమాత్రం ఇబ్బంది పడేవారు కాదు .... ఇలా చెప్పుకుని పొతే , ఇవన్నీ గతకాలపు వైభావాలే అన్నట్లు గా పరిస్థితి మారిపోయింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే , వాటిని లైవ్ టెలికాస్ట్ చూస్తున్న ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అంత దారుణంగా పరిస్థితి తయ్యారయింది. ఏం మాట్లాడినా పర్వాలేదు , ఏం చేసినా అడిగేవారు లేరు అనే రీతిలో సమావేశాలు ఉంటున్నా యన్నది అందరికీ ఎరుకే.

ఇటీవల 5 రోజులపాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సభ్యులు వాడిన పదజాలం హేయనీయంగా వుంది. వైసిపి సభ్యురాలు రోజా అనుచిత వ్యాఖ్యలు చేసారన్న అభియోగంపై ఏడాదిపాటు ఆమెను సభ నుంచి సస్పెండ్ చేసారు. దీనికి నిరసనగా వైసిపి సభ్యులు సమావేశాలు బహిష్కరించారు. ఈ నేపధ్యంలో అసెంబ్లీలో అసలు 18వ తేదీన ఏమి జరిగిందన్న దానిపై, టి డి ఎల్పీ వీడియో క్లిప్పింగ్స్ విడుదల చేసింది. చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ వైసిపి సభ్యుల పదజాలం జుగుప్సాకరంగా ఉందన్నారు. రోజా ఒక్కరే కాదు , పలువురు సభ్యులు ఇంకా దారుణంగా ఉందన్నారు.

వీడియో క్లిప్పింగ్స్ బట్టి కొన్ని అంశాలు ఇలా వున్నాయి. ఒకవైపు నినాదాలు చేస్తూనే వైసీపీ సభ్యులు ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రిని, మంత్రులను ఉద్దేశించి అభ్యంతరకర, అసభ్య వ్యాఖ్యలు చేశారు. రాయలేని కొన్ని బూతులూ మాట్లాడారు. టీడీపీ మహిళా సభ్యురాలిని ఉద్దేశించి... ‘‘నేను ఆమెలాగా మొగుడ్ని కొట్టి పోలీస్‌ స్టేషనకు వెళ్లలేదు. నేనేమీ ఎవడితోపడితే వాడితో పడుకోలేదు'' అని రోజా అనడం స్పష్టంగా వినిపించింది. ‘ధైర్యంలేక మహిళను దించాడు. వాడేం మొగోడు' అంటూ చేతిని వెనక్కి చూపుతూ అన్నారు.

ఇక సిఎమ్ ను ఎద్దేసించి, రోజా ‘కామ సీఎం' అని నినదిస్తున్న సమయంలో పక్కనుంచి మరో సభ్యుడు ‘డాక్టర్‌ కామ సీఎం' (ఇటీవల చంద్రబాబుకు షికాగో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రకటించడాన్ని గుర్తు చేస్తూ) అని మరో పదం జోడించారు. ‘సెక్స్‌ రాకెట్‌లో బాబుకు డాక్టరేట్‌ ఇచ్చారు' అని ఒక సభ్యుడు వ్యాఖ్యానించారు. ‘మహిళల జీవితాలు సర్వనాశనం చేసిన టీడీపీ' అని కూడా రోజా నినాదాలు చేశారు. ఇంతలో కొడాలి నాని ‘‘కుక్కలాగా మొరుగుతాడు సార్‌. సైకోగాడు సార్‌. వాడు వాడు ఎద్దులాగా పెరిగాడు. వాడికి బుద్ధి లేదు' అంటూ మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సిగ్గులేని ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావును చంపిన వెధవలు వీళ్లు! వీళ్లా మాట్లాడేది సన్నాసులు'' అని తిట్టిపోశారు. ఈ సమయంలో మరికొందరు అధికారపక్ష సభ్యులవైపు చేతులు చూపిస్తూ వాదించడం కనిపించింది. ఇక... చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కూడా అదే స్థాయిలో రెచ్చిపోయారు. ‘‘విజయవాడలో అందరూ భయపడుతున్నారు సార్‌. చంద్రబాబు పెద్ద దొంగ సార్‌. లోకేశ బాబు పెద్ద దొంగ సార్‌. చంద్రబాబు, అరడజను దొంగల్లాగా ఉన్నారు సార్‌'' అని అన్నారు. అచ్చెన్నాయుడును ఉద్దేశించి... ‘అచ్చా... లుచ్చా!' అని నినాదాలు చేశారు. స్పీకర్‌ చేసిన సూచనలకు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ప్రతిస్పందిస్తూ... ‘‘దానికి సీనియర్లు అక్కర్లా! ఎప్పుడు వచ్చాం కాదు.. కరెక్ట్‌గా దిగిందా లేదా అన్నది ముఖ్యం. గుర్తు పెట్టుకోండి'' అని అనడం వినిపించింది. స్పీకర్‌ సభను సోమవారానికి వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఇంతలో సీనియర్‌ నేత జ్యోతుల నెహ్రూ... ‘‘ఏం చెప్పిండు! మండేనా (సోమవారమా)!' అంటూ ఒక బూతు పదం వాడారు.

రాయలేని భాషలో , బూతులు తిడుతూ అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు ప్రవర్తించే తీరు ఇంత జుగుప్సాకరంగా వుందంటే , దీనికి ఎవరు బాధ్యులు ... ఎవరిని నిందించాలి .... కిం కర్తవ్యం ....

English summary

Telugu Desam Party Had released the video of Ysrcp MLA Roja Abusing Words in Andhra Pradesh Assembly