టీడీపీలో మగాళ్లు లేరా: రోజా సవాల్‌

MLA Roja challenges on TDP

10:49 AM ON 18th April, 2016 By Mirchi Vilas

MLA Roja challenges on TDP

టీడీపీలో మగాళ్లయిన ఎమ్మెల్యేలు లేరా? ఈ ప్రశ్న అడిగింది ఎవరో కాదు వివాదాస్పద ఫైర్ బ్రాండ్ వైసిపి ఎంఎల్ఎ, నటి రోజా... ఎందుకంటే, టిడిపిలో మగాళ్ళు లేరనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారట. చంద్రాబుబు పై అభ్యంతరకర ఆరోపణలు చేసినందుకు అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ అయిన రోజా, అయినా నోటికి అడ్డూ అదుపు లేకుండా విమర్శలు గుప్పిస్తూనే వుంది. తాజాగా విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరవధిక నిరాహార దీక్షకు దిగిన వైసీపీ విశాఖ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌కు రోజా ఆదివారం సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా..

దీక్షా శిబిరం వద్ద ఆమె మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకి ఏ మాత్రం దమ్ము, ధైర్యం ఉన్నా.. రాయలసీమ గడ్డ పై పుట్టినవాడే అయితే టీడీపీలో చేర్చుకున్న వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు రావాలి’ అని సవాల్‌ విసిరింది.. ఎన్నికలు జరిగితే ప్రజలిచ్చే తీర్పుతో చంద్రబాబు చిన్నమెదడు చితికిపోయి షాక్‌తో కొట్టుకోవడం ఖాయమన్నారు. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో స్టీల్‌ప్లాంట్‌ను సాధించుకున్న స్ఫూర్తితోనే ఉత్తరాంధ్రవాసులు ప్రత్యేక రైల్వేజోన్‌ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రానికి చెందిన ఎంపీలు తమ వ్యాపారాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టేశారంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ గతంలో చేసిన విమర్శలను రోజా గుర్తు చేశారు. ‘ఓటుకు నోటు’ కేసు వల్లే ప్రధాని మోడీ ముందు చంద్రబాబు మోకరిల్లారని ఆమె ఆరోపించింది. ఇక ఆదివారం రాత్రి అమర్‌నాథ్‌ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

English summary

MLA Roja challenges on TDP. YSRCP MLA Roja challenges on TDP for election.