చినబాబు పై విరుచుకు పడిన ఫైర్ బ్రాండ్

MLA Roja Fires On Nara Lokesh

01:34 PM ON 25th February, 2016 By Mirchi Vilas

MLA Roja Fires On Nara Lokesh

వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి విరుచుకు పడింది. ఈ సారి చినబాబు మీద ... అదేనండీ, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మీద .... వైసిపి అధినేత జగన్ కు తాను వీర విధేయురాలైన నగరి ఎమ్మెల్యే రోజా, జగన్ పై ఈగ వాలనివ్వడం లేదు .. రోజమ్మకు ఎక్కడలేని పౌరుషం పొడుచుకొస్తోంది. జగన్ ను ఎవరైనా విమర్శి స్తే చాలు, మా బాస్ నే అంటావా అంటూ అవతలివారిని ఏకిపారేస్తోంది. తాజగా చంద్రబాబు తనయుడు, లోకేష్ ను టార్గెట్ చేసింది.

ఇప్పుడు జ‌గ‌న్‌కు ద‌మ్ముంటే ఒక్క రోజులో ప్ర‌భుత్వాన్ని కూల్చాల‌ని లోకేష్ సవాల్ విసరడంతో రోజా తన నోటికి పని చెప్పింది. తండ్రి అధికారం చూసుకుని వాన‌పాము లాంటి లోకేష్ కూడా నాగుపాములా బుసకొడుతున్నాడని, ఇప్పటికే తెలంగాణ‌లో అవాకులు చెవాకులు పేలి, టీడీపీని ఖాళీ చేయించిన ఘ‌న‌త లోకేష్‌కే ద‌క్కుతుందని, ఇప్పుడు ఏపీలో కూడా టీడీపీని ఖాళీ చేయించేందుకు లోకేష్ కంకణం కట్టు కున్నట్లు కనిపిస్తోందని రోజమ్మ సెటైర్లతో కుమ్మేసింది.

' ప్రభుత్వాన్ని కూల్చడం, ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం.. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు లోకేష్ కే వస్తాయి తప్ప.. జ‌గ‌న్ కు రావు. వైసీపీ నుంచి ఎంత‌మంది ఎమ్మెల్యేలనైనా తీసుకెళ్లు… కానీ నీకు సిగ్గు-సెరం, మానం-మర్యాద ఉంటే వారి చేత రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకో' అంటూ లోకేష్ కు రోజా వీర లెవెల్లో స‌వాల్ విసిరింది. అలా చేస్తే మీ ఫేస్ వ్యాల్యూ ఎంతో ప్ర‌జ‌లే తేలుస్తారని ఎద్దేవా చేసింది.

పనిలో పనిగా చంద్రబాబుని కూడా రోజా దులిపేసింది. 'తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేల‌ను చేర్చుకోవ‌డం ద్వారా తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు వ‌దిలిన కుటుంబాల‌కు చంద్ర‌బాబు వెన్నుపోటు పొడిచారు' అంటూ రోజా దుమ్మెత్తి పోసింది. అందుకే తండ్రి బాటలోనే తనయుడు అన్న చందాన.. చంద్ర‌బాబు దారిలోనే లోకేష్ కూడా వెన్నుపోటు రాజకీయాల కు దిగుతున్నాడని రోజా విమర్శల జడివాన కురిపించింది. అసలే ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన రోజమ్మ తాజాగా చేసిన విమర్శలతో టిడిపి కత్తులు నూరడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary

Fire Brand Ysrcp MLA Roja made Controversial words on Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu Son Nara Lokesh.She says that Nara Lokesh was the reason for failure of TDP in Telangana.She says that Lokesh had no right to talk about her.