రోజా జబర్దస్త్ లో మెగా స్టార్ ఖైదీ ఎలా అయ్యాడు

MLA Roja Interviewed Megastar

11:20 AM ON 11th January, 2017 By Mirchi Vilas

MLA Roja Interviewed Megastar

సినిమావాళ్లు ఎన్ని గొడవలు పడినా ఒక్కటిగానే ఉంటారని అంటుంటారు. ఇక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని కూడా అంటారు. ఇదంతా ఎందుకంటే, మెగాస్టార్ చిరంజీవి, ఫైర్ బ్రాండ్ రోజా ఇద్దరూ సినీమా వాళ్ళే. అలాగే రాజకీయాల్లో ఉన్నవాళ్లే. రాజకీయాల్లో ఇద్దరిదీ చెరో పక్షం. ఇక వీల్లద్దరి మధ్య రాజకీయంగా విమర్శలు ఎన్నో చోటుచేసుకున్నాయి. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఇద్దరూ ఓ షోలో దర్శనమిచ్చారు. ఎందుకంటే, ఈమధ్య సినిమావోళ్ల ప్రమోషన్ పిచ్చి పీక్స్ ని తాకేస్తోంది. పెద్ద సినిమాలు రిలీజయ్యే సమయంలో వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి అటు ఫిల్మ్ ఇండస్ర్టీలో ఇటు ఎలక్ర్టానిక్ మీడియా బిజీగా మారడం చూస్తూనే వున్నాం. సంక్రాంతికి రిలీజయ్యే చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ కోసం ఓ ఛానెల్ నాలుగు అడుగులు ముందుకే వేసింది.

వైసీపీ ఎమ్మెల్యే కమ్ జబర్దస్త్ ఫేం, సీనియర్ హీరోయిన్ గా మూడింతలు కరిష్మావున్న రోజాను రంగంలోకి దింపేసింది. చిరంజీవితో వన్ టు వన్ ఇంటర్వ్యూ కోసం రోజానే ప్రయోగించినట్టు ఆ ఛానెల్ నుంచి అందిన ‘కమింగ్ అప్’. ఖైదీ సినిమా విశేషాలు, మరిన్ని మెగా ముచ్చట్లే కాకుండా మరింత పి.ఆర్.పి రేటింగ్ పెంచుకునే యత్నం ఇది అని అంటున్నారు. చిరంజీవితో కొన్ని సినిమాల్లో కూడా హీరోయిన్ గా చేసిన రోజా, ఇప్పుడు అదే చిరంజీవిని ఎలా ‘ముగ్గు’లోకి లాగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి: శాతకర్ణి మినహాయింపుపై రుద్రమదేవి రచ్చ

ఇవి కూడా చదవండి: ప్రియురాలి భర్తకు విషపు ఇంజక్షన్ ... ఎందుకో తెలిస్తే షాకవుతారు

English summary

Veteran heroine and present MLA Roja was got publicity with Jabardasth show and now she was going to interview Mega Star Chiranjeevi On Khaidi No.150 film.