రోజాకు రంగు పడింది

MLA Roja Suspended From Assembly For One Year

05:55 PM ON 18th December, 2015 By Mirchi Vilas

MLA Roja Suspended From Assembly For One Year

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ వైసిపి ఎంఎల్ఎ రోజా ను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసారు. కాల్ మనీ వ్యవహారంపై రోజా మాట్లాడుతూ కామ (కాల్ మనీ) సిఎమ్ అంటూ వ్యాఖ్యానించడం శోచనీయమని టిడిపి సభ్యులు పేర్కొన్నారు.

మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ సిఎమ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాదించగా స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు ఆమోదిస్తూ , రోజా పై సస్పెన్షన్ వేటు వేసారు.

ఈ నేపధ్యంలో వైసిపి సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి అభ్యంతరం వ్యక్తం చేసారు. నిరసన తెల్పుతూ , నినాదాలు చేసారు. ఈ దశలో స్పీకర్ మాట్లాడుతూ రోజా బయటకు వెళ్లాలని అన్నారు. అయినా వైసిపి సభ్యులు ఆందోళన కొనసాగించారు.

English summary

Ysrcp MLA Roja has suspended from Andhra pradesh assembly for 1 year for her misbehaviour in assemble. Speaker kodela shiva prasad has suspended for one year