డాక్టర్ పై  ఎంఎల్ఎ కుమారుడి దాడి 

MLA Son Attacked On Doctor

02:50 PM ON 28th January, 2016 By Mirchi Vilas

MLA Son Attacked On Doctor

ఇటీవల కాలంలో చట్ట సభలకు ప్రాతినిధ్యం కొంతమంది సహనం కోల్పోయి, అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. ఇక వాళ్ళ పుత్ర రత్నాలు కూడా తాము తక్కువ తినలేదన్నట్లు వ్యహరిస్తూ, రెచ్చిపోతున్నారు. తాజగా బిహార్‌లో ఓ ఎమ్మెల్యే కుమారుడు ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడి పై దాడి చేసి కొట్టిన సంఘటన కలకలం రేపింది. అధికారంలో ఉన్న ఆర్జేడీ పార్టీ ఎమ్మెల్యే కుమారుడు గయ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడిపై గతరాత్రి దాడి చేశాడు. స్థానిక జేడీయూ నేత హత్య కేసులో నిందితుడిగా ఉన్న రంజిత్‌ యాదవ్‌ ఎనిమిది మందితో కలిసి దౌర్జన్యంగా ఆస్పత్రిలోకి ప్రవేశించి డ్యూటీలో ఉన్న డాక్డర్‌పై దాడి చేశారు. రంజిత్‌ వీల్‌ ఛైర్‌తో తనను కొట్టాడని, అతడి వాలకం చూస్తే, తనను చంపడానికి వచ్చినట్లు అనిపించిందని బాధిత డాక్టర్‌ సత్యేంద్ర కుమార్‌ మొర పెట్టుకున్నాడు. గయ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అమిత్‌ కుమార్‌ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

English summary

One of the Bihar's MLA Son Named Ranjith Yadav attacked on hospital doctor in Gaya Government Hospital.As the doctor says that Ranjith attacked with him with wheel chairs and attempetd to murder him.The doctor was aslo filed police case on him and police were started investigating on this incident