కాల్ మనీ వ్యవహారంలో ఎం ఎల్ సి సోదరుని అరెస్టు 

MLC brother Arrested In Call Money Case

01:29 PM ON 15th December, 2015 By Mirchi Vilas

MLC brother Arrested In Call Money Case

ఎపిలో కాల్ మనీ వ్యవహారంపై పోలీసుల దాడులు , సోదాలు కొనసాగుతున్నాయి. విజయవాడలో 92 మంది కాల్ మనీ వ్యాపారుల ఇళ్ళపై పోలీసులు దాడులు జరిపి 52 మందిని అదుపులోకి తీసుకున్నారు. 938 ప్రాంసరి నోట్లు , 193 బ్లాంక్ చెక్కులు , 14.20 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

తెలుగుదేశం ఎంఎల్సి బుద్దా వెంకన్న సోదరుణ్ణి కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కాల్ మనీ వ్యవహారంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తిస్వేచ్చ నిచ్చినట్లు చెబుతున్నారు. ఎపిలో కాల్ మనీ బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని అన్ని జిల్లాల ఎస్పీలు ఇప్పటికే పిలుపు నిచ్చారు.

తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ముగ్గురు ఫైనాన్శియర్లను అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో వున్నారని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కుడా సోదాలు కొనసాగుతున్నాయి

ఈ కేసులో కఠినం గా వ్యవహరిస్తూ , కేసును వెలుగులోకి తెచ్చిన విజయవాడ సిపి గౌతం సవాంగ్ సెలవుపై వెళ్లనున్నట్లు , 15 రోజుల సెలవుకోసం అభ్యర్ధన పంపినట్లు వార్తలొస్తున్నాయి. ఆయన స్థానంలో ఇంచార్జ్ సిపిగా సురేంద్రబాబు వస్తారని కూడా ప్రచారం.

English summary

Tdp MLC budda venkanna brother was arrested in call money case. Police rides continues in Andhra Pradesh