తెలంగాణాలో ఎంఎల్ సి ఓట్ల లెక్కింపుపై  ఉత్కంఠ

MLC Elections Votes Counting Started

11:20 AM ON 28th December, 2015 By Mirchi Vilas

MLC Elections Votes Counting Started

తెలంగాణాలో స్థానిక సంస్థల కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు బుధవారం కౌంటింగ్ కావడంతో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 12 స్థానాలకు గాను ఇప్పటికే ఆరు చోట్ల ఏకగ్రీవంగా టి ఆర్ ఎస్ అభ్యర్ధులు గెలుపొందగా , మిగిలిన చోట్ల కూడా తమకే మెజార్టీ సీట్లు దక్కుతాయని ఆపార్టీ భావిస్తోంది. అయితే నల్గొండ సీటు తమదేనని కాంగ్రెస్ ధీమాగా చెబుతోంది. ఇక్కడ పోలింగ్ సందర్భంగా సూర్యాపేట పోలింగ్‌ కేంద్రంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి అరగంట పాటు ఉన్నారంటూ కాంగ్రెస్‌, టిడిపి నేతలు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించగా, టి ఆర్ ఎస్ శ్రేణులు కొట్టేపారేసాయి. నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమని తెలుస్తోందని జానారెడ్డి వ్యాఖ్యానించారు.

కాగా ఆదివారం జరిగిన పోలింగ్‌ మొత్తం మీద ప్రశాంతంగా ముగిసింది. నాలుగు జిల్లాల్లో కలిపి 98.47 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాలుగు జిల్లాల పరిధిలో 3,867 మంది ఓటర్లకుగాను 3,817 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధిక పోలింగ్‌ శాతం రంగారెడ్డి జిల్లాలో, తక్కువగా ఖమ్మం జిల్లాలో నమోదైంది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రెండేసి స్థానాలకు, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరిగింది. 12 స్థానాలకుగాను కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, మెదక్‌ జిల్లాల్లోని ఆరు స్థానాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మిగతా స్థానాలకు ఆదివారం పోలింగ్ జరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలకు చెందిన 11 మందిని ఆయా పార్టీలు సస్పెండ్‌ చేశాయి. బుధవారం ఓట్ల లెక్కింపు జరుగుతున్నందున పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary