ఎం ఎల్ సి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ 

MLC Notification Passed In Telangana

12:09 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

MLC Notification Passed In Telangana

తెలంగాణాలో 12ఎం ఎల్ సి స్థానాలకు ఎన్నికలకు తెరలేచింది. బుధవారం ఉదయం ఎన్నికల అధికారిక నోటిఫికేషన్ జారీ చేసారు. స్థానిక సంస్థల కోటాలోని 12 ఎం ఎల్ సి సీట్లకు నోటిఫికేషన్ ఇవ్వడంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలైంది. నామినేషన్ వేయడానికి ఈనెల 9వ తేదీ చివరి తేదీ. 10వ తేదీ స్క్రూటినీ చేస్తారు. 12వ తేదీ ఉపసంహరణ కు గడువు. ఈనెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. 30వ తేదీన లెక్కింపు వుంటుంది. వరంగల్ ఉప ఎన్నిక లో అనూహ్య విజయం సాధించి , విపక్షాలకు డిపాజిట్ లేకుండా చేసి , మంచి జోష్ మీదున్న టి ఆర్ ఎస్ స్థానిక సంస్థల కోటాలో ఎం ఎల్ సి ఎన్నికల్లో కూడా విజయ బావుటా ఎగుర వేయడానికి పావులు కదుపుతోంది.

అయితే కాంగ్రెస్ పార్టీ తనకున్న బలాన్ని బట్టి కీలకమైన స్థానాలను దక్కించుకోవడంతో బాటూ , కల్సి వచ్చే పార్టీలను కలుపుకొని మరికొన్ని స్థానాల్లో కూడా సత్తా చాటాలని తద్వారా టి ఆర్ ఎస్ దూకుడికి కళ్ళెం వేయాలని భావిస్తోంది. మరోపక్క తమ బలాన్ని బట్టి సీట్లు పొందడం ద్వారా ఎకగ్రీవ ఎన్నికకు కూడా మార్గం సుగం చేయాలని చూస్తోంది. అయితే ఆపార్టీలో విబ్బిన్న వాదనలు రావడంతో హైకమాండ్ జోక్యం చేసుకుని పరిస్థితిని గమనిస్తోంది త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉండడంతో కాంగ్రెస్, టి ఆర్ ఎస్ లు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

మరోపక్క బిజెపి , టిడిపి , వాపపక్షాలు తమకు అందివచ్చే అవకాశాలను బేరీజు వేస్తున్నాయి. ఆయా జిల్లాల్లో పరిస్థితిని బట్టి పొత్తులు వుండే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి టి ఆర్ ఎస్ ని టార్గెట్ గా చేసుకుని ఆయా పార్టీలు వ్యూహం రచిస్తున్నాయి.

English summary

MLC Notification passed in telangana. Nominations for 12 local MLC quota seats were started.The last date for giving nominations is 9th of this month