జగన్ 'హీరోయిన్స్' తో  రాసలీలలా ...

MLC Rajendra Prasad Controversial Comments On Jagan

09:43 AM ON 8th March, 2016 By Mirchi Vilas

MLC Rajendra Prasad Controversial Comments On Jagan

సినిమాకు , రాజకీయాలకు అవినాభావ బంధం వుంది. సినిమాల్లో వున్నవాళ్ళు రాజకీయాల్లోకి వస్తుంటే, రాజకీయాల్లో వున్నవాళ్ళు సినీ సంబంధాలు పెట్టుకుంటున్నారు. దీంతో రకరకాల పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇక విమర్శకులకు ఆయుధం దొరుకుతోంది. తాజాగా సినిమా ప్ర‌పంచానికి కేరాఫ్ అడ్ర‌స్‌.. ఫిల్మ్‌న‌గ‌ర్‌ లో సినిమాల గురించి చర్చ మానేసి, వైఎస్ జ‌గ‌న్ `హీరోయిన్స్` గురించి చ‌ర్చించుకుంటున్నార‌ట‌. ఇంతకీ విషయం ఏమంటే, వైసిపి నేత జగన్‌ కు సినీ తారలతో సంబంధాలున్నాయని, వారాలు, నెలల తరబడి మాయమై `ఏకాంతంగా` సేద తీరుతుంటాడని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ వ్యాఖ్యానించారు. దీంతో అంశంపై చర్చ సాగుతోంది. సాధారణంగా ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని హోట‌ళ్ల‌లో, రెస్టారెంట్ల‌లో ఏ ఇద్ద‌రు వ్య‌క్తులు కలిసినా.. ఎవ‌రు ఏ టాపిక్‌ మాట్లాడుకున్నా, బాహుబలి గురించో, బాలయ్య వందవ సినిమా గురించో , వర్మ సినిమా గురించో చర్చించుకోవడం రివాజు. కానీ ఇప్పుడు వాళ్ల టాపిక్ అంతా జగన్ `హీరోయిన్స్' వైపే వెళుతోంద‌ట‌. టీడీపీ భావి అధ్యక్షుడు, చినబాబు లోకేష్ ను టార్గెట్ చేసుకుని వైసిపి నేతలు వ్యక్తిగత జీవితంపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా లోకేష్ చదువుకున్న సమయంలో అమ్మాయిల‌తో దిగిన ఫోటోలను చూపెడుతూ చెడు తిరుగుళ్లు తిరుగుతున్నాడని అంబటి రాంబాబు ఆరోపణలు ఆమధ్య కలకలం రేపాయి. అందుకు ప్రతిగా చంద్రబాబుకు నమ్మిన బంటు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ రంగంలో దిగి జగన్‌ కు సినీ తారలతో సంబంధాలున్నాయని.. వారాలు, నెలల తరబడి మాయమై `ఏకాంతంగా` సేద తీరుతుంటాడని ఆరోపించారు. ఇంకేముంది చర్చ అటే నడుస్తోంది.

English summary

Telugu Desam Party Leader MLC Rajendra Prasad made som controversial words on Ysrcp Party President Y.S.Jagan.Rajendra Prasad says that Jagan had affairs with heroines and he used to spend time with the heroines.