వావ్ , చాక్లెట్ బిళ్ల ... ఇలా కరుగుతోందేంటి?

M&M Chocolates Dissolving in Water

10:44 AM ON 20th December, 2016 By Mirchi Vilas

M&M Chocolates Dissolving  in Water

కొన్ని విషయాలు ఆసక్తి కలిగిస్తాయి. మరికొన్ని వింతగా ఉంటాయి. మరికొన్ని అందాన్ని ఆస్వాదించేలా చేస్తాయి. చాక్లెట్ బిళ్ల నీటిలో కరుగుతున్న దృశ్యం ఇంత అందంగా ఉంటుందని ఈ వీడియో చూసే వరకూ తెలియదు. బ్యూటీ ఆఫ్ సైన్స్ కు చెందిన బృందం సభ్యులు వివిధ రంగుల్లో ఉన్న ఎం&ఎం చాక్లెట్ బిళ్లలను నీళ్లలో వేశారు. అవి నీళ్లలో కరుగుతున్నవిధానాన్ని సోనీ ఏ7ఆర్ ఎం2 కెమెరా ఉపయోగించి 4కే హై-రెజల్యూషన్ టైం-లాప్స్ వీడియో తీశారు. ఈ వీడియోలో బిళ్లలు కరుగుతున్న విధానం చాలా అద్భుతంగా రికార్డయ్యింది. ఇటువంటి దృశ్యాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ రికార్డు చేయలేదు. చాక్లెట్ బిళ్లల నుంచి వాటి రంగు అసంఖ్యాక తీగలుగా నీటిలో కరుగుతున్న దృశ్యం స్పష్టంగా రికార్డయ్యింది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కెయ్యండి ...

English summary

"Beauty of Science" is an educational brand. The Beauty of Science team remarkable color show.