ఐఆర్‌సీటీసీ పేమెంట్ ఆప్షన్‌గా మొబిక్విక్..

MobiKwik as payment option on irctc mobile app

04:29 PM ON 9th December, 2015 By Mirchi Vilas

MobiKwik as payment option on irctc mobile app

రైల్వే టికెట్లు తీసుకునేందుకు వినియోగించే ఐఆర్‌సీటీసీ తన ఆండ్రాయిడ్ యాప్‌లో టికెట్ పేమెంట్ ను ఇకపై డిజిటల్ వాలెట్ 'మొబిక్విక్‌'తో చయొచ్చు. ఇందుకోసం మొబిక్విక్ ను తన మొదటి ఆప్షన్‌గా చేరుస్తూ ఐఆర్సీటీసీ నిర్ణయం తీసుకుంది. ఈ సదుపాయం మంగళవారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ కనెక్ట్ యాప్ ద్వారా రోజుకు 25వేల నుంచి 30వేల వరకు టిక్కెట్లు అమ్ముడవుతున్నాయని ఐఆర్ సీటీసీ పేర్కొంది. వినియోగదారులు మరింత సులభంగా, వేగంగా డబ్బులు చెల్లించేందుకు మొబిక్విక్ ఆప్షన్‌ను అందిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం మొబిక్విక్‌ను 25 మిలియన్ల మంది యూజర్లు వాడుతున్నారని ఇది తమకు ఎంతో ఉపకరించే అంశమని పేర్కొంది. మొబిక్విక్ వంద శాతం సక్సెస్ రేటుతో పేమెంట్లు చేస్తోందని సంస్థ సీఈవో వెల్లడించారు.

English summary

MobiKwik announced that IRCTC has chosed its wallet as the first payment option on IRCTC's Connect Android App