‘ఇ-కామర్స్‌’ రక్షణకు మొబైల్‌యాప్‌

Mobile App To Secure E-Commerce

06:38 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Mobile App To Secure E-Commerce

మనదేశంలో ఇ-కామర్స్‌ వ్యాపారం రోజురోజుకీ విస్తరిస్తోంది. గుండుసూది నుంచి కార్ల వరకూ అన్నీ ఇప్పుడు ఆన్ లైన్ లో దొరికేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల రక్షణ కోసం త్వరలో కొత్త మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి రానుంది. ఆయా ఉత్పత్తులకు ఉన్న హామీ(వారంటీ), వ్యాపారి/ ఒప్పందం ధ్రువీకరణ వంటి విషయాల్లో ఈ యాప్‌ సహాయకారిగా ఉంటుంది. వినియోగదారుల్ని, అమ్మకందారుల్ని అనుసంధానించడం కోసం వారంటీర్‌.కామ్‌ పేరుతో వచ్చే నెలలో ఈ యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు యాప్ సీఈవో సుమిత్‌లాల్‌ తెలిపారు. ఉదాహరణకు ఒక మొబైల్ కొన్న వినియోగదారుడు దాని క్రమ సంఖ్యను, రసీదు వివరాలను స్కాన్‌ చేసి యాప్‌లో భద్రపరిస్తే ఆ ఉత్పత్తికి హామీ ఉందో లేదోననే విషయాన్ని తెలియజేస్తుందని వివరించారు.

English summary

A new mobile application is set to be launched in India to take care of product warrantees and help identify the authenticity of deals and dealers in a bid to ensure consumer safety in the fast-growing world of e-commerce.