మొబైల్ ఏటీఎంలు వచ్చేశాయ్

Mobile atm's in use

12:49 PM ON 17th November, 2016 By Mirchi Vilas

Mobile atm's in use

ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కొత్త నోట్ల కోసం ఏటీఎంలు, బ్యాంకుల వద్ద బారులు తీరుతోన్న ప్రజలకు వూరట కలిగించేందుకు హైదరాబాద్ లో మొబైల్ ఏటీఎం వాహనాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటి ద్వారా రోజుకు రూ.2వేలు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. జంట నగరాల్లోని కీలకప్రాంతాల్లో సేవలందించనున్న మొబైల్ ఏటీఎంలను హైదరాబాద్ కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో చీఫ్ జనరల్ మేనేజర్ లాంఛనంగా ప్రారంభించారు. స్వైపింగ్ మిషన్ తో పాటు ఓ వ్యక్తి వాహనంలో ఉండి వినియోగదారులకు అవసరమైన నగదును తక్షణం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

బ్యాంకు పని వేళల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మొబైల్ ఏటీఎంలు ఆదివారం కూడా అందుబాటులో ఉంటాయట.

English summary

Mobile atm's in use