జూన్‌ నాటికి 37.1 కోట్ల మొబైల్‌ నెట్ యూజర్లు

Mobile net users reaches 37 crores

05:00 PM ON 4th February, 2016 By Mirchi Vilas

Mobile net users reaches 37 crores

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. ఆన్‌లైన్‌ కమ్యూనికేషన్‌, సోషల్‌ మీడియా, ఈ కామర్స్‌ పోర్టల్స్‌.. ఇలా ఏదో అవసరానికి ఇంటర్నెట్ ను మనం వినియోగిస్తున్నాం. అయితే పీసీలతో పాటు స్మార్ట్ ఫోన్ల లోనూ ఇంటర్నెట్ వాడకం ఈ మధ్యకాలంలో పెరిగింది. ఇంకా చెప్పాలంటే పీసీలకంటే స్మార్ట్ ఫోన్ల ద్వారానే ఇంటర్నెట్ వాడేందుకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఈ ఏడాది జూన్‌ నాటికి ఇండియాలో మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగదారులకు సంఖ్య 37.1 కోట్ల(371 మిలియన్ల)కు చేరనుందట. ఈ మేరకు మొబైల్‌ ఇంటర్నెట్‌ ఇన్‌ ఇండియా 2015 పేరుతో ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఐఏఎంఏఐ), ఐఎంఆర్‌బీ నివేదికను విడుదల చేసింది. గతేడాది డిసెంబర్‌ నాటికి భారత్‌లో 306 మంది మొబైల్‌ ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో 219 మిలియన్ల మంది పట్టణ ప్రాంత ప్రజలున్నారు. 2014తో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ వాడకం 93 శాతం పెరిగిందని నివేదిక వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది కమ్యూనికేషన్‌ కోసం ఉపయోగించగా.. గ్రామీణ ప్రాంతాల్లో సోషల్‌ మీడియా కోసం ఎక్కువగా మొబైల్‌ ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నట్లు తేలింది. స్మార్ట్‌ఫోన్ల వాడకంలోనూ.. భారత్‌ ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది.

English summary

Mobile net users reaches 37.1 crores.The report said the share of mobile Internet spend out of the average monthly bill increased to 64 percent in 2015, compared to 54 percent in 2014.