బట్టలు బాలేదని లోపలకి రానివ్వకుండా ఆపేసిన ఫేమస్ రెస్టారంట్!

Mocambo restaurant not allowed a car driver for not dressing good

12:00 PM ON 15th September, 2016 By Mirchi Vilas

Mocambo restaurant not allowed a car driver for not dressing good

కొన్ని చోట్ల హోటల్స్ కి భలే పేరుంటుంది. ఇక సంతోషాల నగరం కోల్ కత్తాలో 'మొకాంబో' హోటల్ కు గొప్ప పేరుంది. జాజ్ మ్యూజిక్ తో సందర్శకులకు ఎంతో ఆనందాన్ని పంచుతూ ఉంటుంది. పసందైన వంటకాలకు కూడా ఇది పెట్టింది పేరు. ఇదిలావుండగా, గత శుక్రవారం దిలాషీ హేమ్నానీ, మనీష్ భయ్యా అనే ఇద్దరు వ్యక్తులు ఆ హోటల్ లో తీవ్ర అవమానం ఎదుర్కొన్నారు. ఇద్దరూ కలిసి భోజనం చేయాలని అక్కడికి వెళ్ళారు. కానీ మనీష్ భయ్యా ధరించిన బట్టలు శుభ్రంగా లేవంటూ ఆయనకు భోజనం పెట్టడానికి హోటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో అతడి యజమాని అయిన హేమ్నానీ తన ఆవేదనను ఫేస్ బుక్ ద్వారా ప్రపంచంతో పంచుకున్నాడు. దిలాషీ హేమ్నానీ ఆటోమొబైల్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తున్నారు.

1/4 Pages

ఆమెకు అనేక సంవత్సరాలుగా కారు డ్రైవర్ గా మనీష్ భయ్యా సేవలందిస్తున్నారు. ఆమె కోల్ కత్తా నుంచి వెళ్ళిపోతుండటంతో మనీష్ కు ఘనంగా పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకుని, మొకాంబో హోటల్ కు తీసుకెళ్ళారు. కానీ అక్కడి సిబ్బంది ఆయనను లోపలికి రానివ్వలేదు. ఆయన దుస్తులు బాగోలేవని చెప్పారు. ఆమె హోటల్ మేనేజర్ ను కూడా కలిసి, మనీష్ ను లోపలికి రానివ్వాలని డిమాండ్ చేశారు.

English summary

Mocambo restaurant not allowed a car driver for not dressing good. Famous Mocambo restaurant in Kolkata not allowed a car driver into the restaurant for not dressing good.