న్యూయార్క్ నగర వీధుల్లో మోడ్రన్ అల్లా ఉద్దీన్

Modern Alla-Udeen In Newyork

07:18 PM ON 7th November, 2015 By Mirchi Vilas

Modern Alla-Udeen In Newyork

అల్లా ఉద్దీన్ అద్భుత దీపం కథలో అల్లా ఉద్దీన్ ప్రజలను ప్రమాదాల నుండి రక్షిస్తు చేసిన సాహసాలు పిల్లలను , పెద్దలను ఎంతగానో ఆకట్టుకున్నాయి . ఈ ఆధునిక యుగంలో కూడా అటువంటి విన్యాసాలు చేస్తున్న యువకుడు అమెరికాలోని న్యూయార్క్ వీధుల్లో హాల్ చల్ చేస్తున్నాడు . అల్లా ఉద్దీన్ నిజంగా మన ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు . వృత్తిరిత్యా స్టంట్ మేకర్ , ఫిలిం మేకర్ అయిన నాస్టాట్ తన విన్యాసాలతో న్యూయార్క్ ప్రజలను అబ్బుర పరిచాడు. ఎప్పుడు బిజీగా ఉండే న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. స్కేట్ బోర్డుకు ఒక ఎర్రటి తివాచీను అమర్చి తన చేతిలోని రిమోట్ సాయంతో తివాచీను కంట్రోల్ చేస్తూ అల్లా ఉద్దీన్ వేషధారణలో నాస్టాట్ చేసిన ఫీట్లకు న్యూయార్క్ ప్రజలు ఫిదా అయ్యారు . ఈ ఆధునిక అల్లా ఉద్దీన్ విన్యాసాలకు అతని బాడి లాంగ్వేజ్ కుడా తోడవడంతో నాస్టాట్ ఫీట్లకు మరింత ఆదరణ లభించింది.

English summary

Modern Alla-Udeen In Newyork