ఆడాళ్లు స్కర్టులు ధరించడంపై మోడీ షాకింగ్ కామెంట్స్

Modi at the Ceremony for Repatriation of Cultural Property in USA

10:42 AM ON 9th June, 2016 By Mirchi Vilas

Modi at the Ceremony for Repatriation of Cultural Property in USA

ఆడాళ్లు స్కర్టులు ధరించడంపై పలువురు ప్రముఖులు వివిధ రకాల వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. అయితే, ఆడవాళ్లు ధరించే స్కర్ట్ లపై తాజాగా భారత ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. స్కర్ట్ లు భారతీయ సంస్కృతిలో భాగమే అన్నారు. భారతదేశంలో ఫ్యాషన్ అనేది 2వేల సంవత్సరాల క్రితం నుంచే ఉందన్నారు. వాషింగ్టన్ లో జరిగిన ఇండియన్ కల్చరల్ ప్రాపర్టీ కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్రమోడీ ఈ వ్యాఖ్యలు చేస్తూ, కోణార్క్ సూర్య దేవాలయం వద్ద రెండు వేల సంవత్సరాల క్రితం, కళాకారులు చేసిన శిల్పాలు స్కర్టులు ధరించి, హ్యాండ్ బ్యాగ్ వేసుకెళ్తున్న యువతుల బొమ్మలే దీనికి సాక్షమన్నారు.

అయితే, ప్రధాని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. స్కర్ట్స్ ధరించి పర్సులను పట్టుకున్న విగ్రహాలను రెండు వేల సంవత్సరాల క్రితమే మన కళాకారులు చెక్కారని చెప్పి మోదీ తప్పులోకాలేశారని అంటున్నారు. కోణార్క్ ఆలయం రెండు వేల సంవత్సరాల క్రితంది కాదని, అది 13వ శతాబ్దంలో, అంటే 1250 ప్రాంతంలో నిర్మించిందని క్లారిటీ ఇస్తున్నారు. కోణార్క్ దేవాలయం నిర్మించి ఇప్పటికి 766 సంవత్సరాలు దాటిందంతే అంటూ సవివరంగా వివరిస్తున్నారు. మినీ స్కర్టుల ధరించారని, హ్యాండ్ బ్యాగ్స్ వేసుకున్నారని మోడీ మాట్లాడడాన్ని కూడా నెటిజన్లు తప్పుబడుతున్నారు. కొన్ని స్త్రీ విగ్రహాలకు మాత్రమే నడుముకు నగలు ధరించినట్లుగా శిల్పాల్లో ఉంటుందని వాటిని ఆధునిక స్కర్టులతో పోల్చలేమంటున్నారు. మరికొందరు "ఏదైమైనా మీరు భారత చరిత్ర చదువుకోవాలి గురువు గారూ!" అంటూ మోడీపై సెటైర్లు వేసేస్తున్నారు. నరేంద్ర మోడీ గతంలో కూడా తక్షశిల, గయా గురించి కూడా తప్పుగా మాట్లాడారని పలువురు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి పెద్ద వాళ్ళు మాట్లాడే మాటలపై పదుగురి దృష్టి వుంటుంది అందుకే చాలా జాగ్రత్త అవసరం అని విశ్లేషకులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: శ్రియకే బాలయ్య ఓటు పడిందట..

ఇది కూడా చూడండి: అందుకే, నో.. అనలేకపోయిందట

ఇది కూడా చూడండి: లగ్జరీ కార్లను ఇలా పడేస్తారట

English summary

Modi at the Ceremony for Repatriation of Cultural Property in USA.